ఇక వైయస్ జగన్ వర్గం ఫైట్

YS Jagan
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) నాయకత్వంపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం తీవ్రంగా మండిపడుతోంది. పిసిసి సమావేశానికి తమను దూరంగా ఉంచడంపై ఈ వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం జరిగిన పిసిసి సమావేశానికి జగన్ వర్గానికి చెందినవారికి అహ్వానాలు అందలేదు. నెల్లూరు జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు గోపాల్ రెడ్డిని, తిరుపతి పట్టన కాంగ్రెసు నాయకుడు ప్రతాపరెడ్డిని సమావేశానికి పిసిసి దూరంగా పెట్టింది. దీన్ని బట్టి వైయస్ జగన్ వర్గానికి చెక్ పెట్టేందుకే కాంగ్రెసు నాయకత్వం నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. పార్టీ అధిష్టానం సూచనల మేరకే పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వారిని పక్కన పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై జగన్ వర్గం నిప్పులు కక్కేందుకు సిద్ధమవుతోంది.

నెల్లూరు జిల్లాలో గోపాల్ రెడ్డిని పక్కన పెట్టి, వ్యవహారాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పిసిసి అప్పగించింది. దీనిపై గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. వైయస్ జగన్ ది వ్యక్తిగత యాత్ర అని, అందువల్ల తాను పాల్గొన్నానని ఆయన చెప్పారు. వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పిసిసి సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. అలాగే, ప్రతాపరెడ్డి కూడా అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జగన్ వర్గానికి సంబంధించి ఇప్పటికి ఓ స్పష్టత వచ్చినట్లు భావిస్తున్నారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు వంటి అందరినీ కాంగ్రెసు దూరంగా పెట్టాలనే నిర్ణయానికే వచ్చినట్లు కనిపిస్తుంది. దీనిపై జగన్ వర్గం కూడా ఓ స్పష్టతకు వచ్చి, తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అంబటి రాంబాబు మాత్రమే ఎక్కువగా పార్టీ నాయకత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ అప్పుడప్పుడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ వర్గం కలిసికట్టుగా విమర్శనాస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+