వైయస్ జగన్ క్లియర్

వైయస్ జగన్ పై కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. తెలంగాణ అంశం తేలేవరకు వైయస్ జగన్ కూడా అంత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఈలోగా ఆయన కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర ఖరారయ్యే అవకాశం ఉంది. అది కూడా పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతనే ఉంటుందని అంటున్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ఏ విధంగా వ్యవహరించబోతుందనేదానిపై కూడా జగన్ కు స్పష్టత ఉండి ఉంటుంది. తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం అనుకూలంగా ఉండడం వల్లనే సీమాంధ్రలో తన బలాన్ని పెంచుకోవడానికి ఓదార్పు యాత్రల ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. తెలంగాణకు కాంగ్రెసు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. వ్యూహాత్మకంగా మాత్రం తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తాను కాదని ఆయన ప్రస్తుతానికి అంటున్నారు.












Click it and Unblock the Notifications