జగన్ ఆపరేషన్ - 2

Sonia Gandhi
పార్టీ నుంచి వైయస్ జగన్ వెళ్లిపోయేలా చేయడంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ విజయం సాధించినట్లే భావిస్తున్నారు. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి కల్పించడంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం వ్యూహం ఫలించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసి, కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో వైయస్ జగన్ వర్గాన్ని తీవ్రంగా దెబ్బ తీసినట్లు భావిస్తున్నారు. తమను ధిక్కరిస్తూ వచ్చిన వైయస్ జగన్ ను ఒంటరిగా పార్టీ నుంచి పంపించే వ్యూహాన్ని పార్టీ అధిష్టానం అనుసరించింది. అందులో విజయం సాధించిన సోనియా గాంధీ వైయస్ జగన్ ఆపరేషన్ 02ను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టి రాష్ట్రవ్యాప్తంగా తన సత్తాను చాటాలని భావిస్తున్న వైయస్ జగన్ కు సొంత జిల్లాలోనే కుంపటి పెట్టినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందినవారిని బుజ్జగించే చోటు బుజ్జగించింది, బెదిరించే చోట బెదిరించింది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఏర్పడిన సంక్షోభాన్ని కూడా నివారించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ ఒక్క గండం గడిస్తే వైయస్ జగన్ ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదని అధిష్టానం భావిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ మంత్రులను దారికి తెచ్చుకోవడంలో అధిష్టానం విజయం సాధించింది. కోస్తా మంత్రులతో చర్చలు జరుగుతున్నాయి. వట్టి వసంత కుమార్ మాట వినకుండా వెళ్లిపోయినా ఫరవా లేదనే ధోరణితోనే పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం కూర్పులోనే వైయస్ జగన్ ఆపరేషన్ -2కు శ్రీకారం చుట్టిన అధిష్టానం దాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధపడింది. కడప జిల్లాలోనే వైయస్ జగన్ కు కుంపటి రాజేసే ప్రయత్నాన్ని ప్రారంభించింది. పది శాసనసభా స్థానాలున్న కడప జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు మంత్రులను తీసుకున్నారు. డిఎల్ రవీంద్రారెడ్డికి, అహ్మదుల్లాలకే కాకుండా వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చింది. ఈ ముగ్గురు కూడా వైయస్ జగన్ ప్రాతినిధ్యం వహించిన కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోని వారే కావడం విశేషం. డిఎల్ రవీంద్రా రెడ్డి ఒకప్పుడు వైయస్సార్ కు అనుంగు మిత్రుడు. వైయస్సార్ ముఖ్యమంత్రి ఆయిన తర్వాత ఆయనను దూరం చేసుకున్నారు. అహ్మదుల్లా కూడా వైయస్సార్ కు విధేయుడే. ఆయన వైయస్ జగన్ వెళ్లకుండా కాంగ్రెసు అధిష్టానం జాగ్రత్త పడింది.

మరోవైపు, ఏకంగా వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి వైయస్సార్ కుటుంబంలో చీలిక తెచ్చింది. పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఏర్పడే పరిస్థితిని కల్పించింది. అంతేకాకుండా సోనియా గాంధీ వైయస్ వివేకానంద రెడ్డితో మరింత లోతుగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి వైయస్ జగన్ పై వైయస్ వివేకానంద రెడ్డిని, కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ సోదరి షర్మిళపై వైయస్ వివేకానంద రెడ్డి కూతురును పోటీకి దించేందుకు కూడా నిర్ణయం జరిగిపోయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, వైయస్ జగన్ ఆపరేషన్ -2ను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని సోనియా అమలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+