వైయస్ జగన్ ప్లాన్ ఏమిటి?

YS Jagan
ప్రభుత్వాన్ని తాము కూల్చబోమని అంటూనే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని వైయస్ జగన్ అన్నారు. దీన్ని బట్టి వైయస్ జగన్ రాజకీయ వ్యూహమేమిటనే విషయంపై పలు సందేహాలు వ్యక్తం కావడం సహజం. తాము తల్చుకుంటే ప్రభుత్వం మనుగడ సాగించలేదని కూడా వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులంటున్నారు. అయితే, వైయస్ జగన్ మాత్రం పక్కా వ్యూహంతోనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా వ్యవహారాన్ని మలుచుకుని ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చేలోగా కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ఆయన చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్ సాధ్యమైనంత త్వరలోనే పార్టీని స్థాపించే అవకాశాలున్నాయి. పార్టీ పేరు కూడా వైయస్సార్ కాంగ్రెసుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టే సమయంలో తన వర్గానికి చెందిన శానససభ్యులతో ఆయన రాజీనామాలు చేయిస్తారని అంటున్నారు. పార్టీ పెట్టేంత వరకు వారంతా కాంగ్రెసులోనే కొనసాగుతారని అంటున్నారు. మరో వ్యూహం కూడా ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని స్థాపించి అన్ని జిల్లాల్లో పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత శాసనసభ్యులతో రాజీనామాలు చేయించడం రెండోది. లేకుంటే, పార్టీ స్థాపించిన తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో కాంగ్రెసు శాసనసభా పక్షాన్ని చీల్చడం కూడా మరో వ్యూహం. శాసనసభా పక్షాన్ని చీల్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనేది కూడా వైయస్ జగన్ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

వైయస్ జగన్ వైపు 70 మంది దాకా శాసనసభ్యులు వస్తారని అంటున్నారు. అంత మంది కాకపోయినా 50 మంది వచ్చినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వం మనుగడ సాగించడం సాధ్యం కాదు. ఈ స్థితిలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ పుంజుకోకుండా చూసుకునే విధంగా ఆ వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు. కడప, పులివెందులతో పాటు మరిన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు వచ్చేలా వైయస్ జగన్ చూస్తారా అనేది కూడా ప్రధానమైన అంశంగానే ఉంది. ఇలా పలు వ్యూహాల్లో ఏది అనుకూలంగా ఉంటే దాన్ని అమలు చేయాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించకుండా చూడడమే ఆయన ముందున్న లక్ష్యమని అంటున్నారు. దానికితోడు ప్రభుత్వాన్ని పడగొట్టామనే పేరు తనకు రావద్దని కూడా ఆయన అనుకుంటున్నారు. వైయస్సార్ ఆశయాల నుంచి పక్కకు జరగడం వల్లనే ప్రభుత్వం కూలిపోయిందని అనిపించడం ఆయనకు కావాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+