పులివెందుల నుంచి వైయస్ వివేకా?

కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి గెలిచిన వైయస్సార్ సతీమణి వైయస్ విజయలక్ష్మి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అవుతోంది. ఆరు నెలలలోగా ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఆశ చూపి కాంగ్రెసు అధిష్టానం తన వైపు తిప్పుకుంది. ఆయన సోమవారం కడపకు చేరుకున్నారు. మీడియాతో మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. వైయస్ జగన్, విజయలక్ష్మి రాజీనామాలు చేస్తారని ముందే ఊహించిన అధిష్టానం వైయస్ వివేకానంద రెడ్డిని పులివెందుల నుంచి పోటీకి దించాలనే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ వివేకానంద రెడ్డికి స్పష్టంగా ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీ పర్యటనలో రెండు విడతలు సోనియా గాంధీతో మాట్లాడారు.

వైయస్ జగన్ తీరు పట్ల చాలా కాలంగా వైయస్ వివేకానంద రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానాన్ని వ్యతిరేకించడాన్ని ఆయన తప్పు పడుతూ వస్తున్నారని అంటున్నారు. వైయస్ జగన్ ను తన కుటుంబ పెద్దగా అప్పట్లో ప్రకటించుకున్నారు కూడా. అయితే, ఏనాడూ ఆయన వైయస్ జగన్ తీరును మనస్పూర్తిగా అంగీకరించలేదని అంటున్నారు. కడప పార్లమెంటు సీటు జగన్ వల్లనే వైయస్ వివేకానంద రెడ్డికి దక్కలేదు. 2004 ఎన్నికల తర్వాత మధ్యలో వైయస్ వివేకానంద రెడ్డిని కడప పార్లమెంటు సీటుకు రాజీనామా చేయించాలని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నించారు. ఆ స్థానంలో తన కుమారుడు వైయస్ జగన్ ను పోటీకి దించాలని అనుకున్నారు. కానీ, సోనియా గాంధీ అందుకు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని వైయస్సార్ విరమించుకున్నారు.

వైయస్సార్ 2009 ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి తన కుమారుడు వైయస్ జగన్ కు కడప పార్లమెంటు సీటు టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆ తర్వాత వైయస్ వివేకానంద రెడ్డిని శాసన మండలికి ఎంపిక చేయించారు. వైయస్సార్ మరణం తర్వాత పులివెందుల శాసనసభా స్థానానికి వైయస్ జగన్ పోటీ చేయడానికి ప్రయత్నించారు. అందుకు కూడా సోనియా అంగీకరించలేదు. వైయస్సార్ సతీమణి వైయస్ విజయలక్ష్మికి టికెట్ ఇచ్చింది. వైయస్ జగన్ తప్ప వైయస్సార్ కుటుంబ సభ్యులు ఎవరు పులివెందుల నుంచి పోటీ చేసినా అభ్యంతరం లేదని పార్టీ అధిష్టానం ప్రకటించింది. దాంతో వైయస్ విజయలక్ష్మి వైపు జగన్ మొగ్గు చూపారు. దాంతో ఆమె పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+