టివి5ను టార్గెట్ చేసిన ఏబిఎన్

అయితే ప్రజల వీక్‌నెస్‌ను వ్యాపారంగా మల్చుకుందని చెప్పింది. వాడేటప్పుడు నిబంధనలు ఉంటాయని చెప్పడం మరో విడ్డూరమన్నారు. న్యూజెన్ వాడుతున్న సమయంలో మరో ఆయిల్ ఉపయోగించవద్దు, హెర్బల్ షాంపూ మాత్రమే వాడాలి, రెగ్యూలర్‌గా వాడాలి తదితర నిబంధనలు పెట్టింది. అయితే ఇలాంటి నిబంధనల ద్వారా న్యూజెన్ మాత్రమే కాదు ఎలాంటి ఆయిల్ వాడినా వెంట్రుకలు రాలవని చెప్పారు. మరో విషయమేమంటే ఒక్క బాటిల్ కాకుండా ఐదు బాటిళ్లు వాడాలని కండిషన్ ఉందని చెప్పారు. ఒక్కోదాని ధర 396 రూపాయలు పెట్టి పూర్తి వ్యాపారాత్మకం చేశారని ఆరోపించింది.
కాగా న్యూజెన్‌తో జుట్టు రాలిపోదనే మాటల్లో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారని చెప్పింది. ఈ ఆయిల్ వల్ల జుట్టు ఊడటం అటుంచి ముందు ముందు జుట్టు మరింత ఎక్కువగా ఊడిపోయే ప్రమాదముందని చెప్పింది. ప్రజలకు నిజాలు చెప్పవలసిన మీడియా సంస్థనే ప్రజలను మోసం చేస్తుందని టివి5 అధినేత బిఆర్ నాయుడిని విమర్శించింది.












Click it and Unblock the Notifications