వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు దిశగా ఆంధ్రప్రదేశ్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమిళనాడు దిశగా సాగుతున్నాయని అంటున్నారు. ఈ మాట అంటున్నదెవరో కాదు, స్వయానా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోయి రెండు ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన పార్టీ పెద్దలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోయి తమిళనాడు రాజకీయాల తరహా రాజకీయాలకు వేదికగా మారబోతోందని ఆయన చెప్పినట్లు సమాచారం.

రెండు రోజుల పాటు హైదరాబాదులో ఉన్న ఆయన పార్టీ తీరు పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తమ పార్టీకి వైయస్ జగన్‌ను సమస్యగా భావించారు. కానీ సమస్య జగన్ కాదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే అసలు సమస్య అని ఆయన ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి మీద వెల్లువెత్తిన అసంతృప్తి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి మీద కూడా రాలేదని అంటున్నారు. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెసు పార్టీకి మేజర్ సర్జరీ అవసరమని ఆయన పార్టీ అధిష్టానవర్గం పెద్దలకు చెప్పారని అంటున్నారు.

వివిధ నాయకులు అందిస్తున్న సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటూ వస్తున్న పార్టీ అధిష్టానం గులాం నబీ ఆజాద్ ప్రత్యక్షంగా చూసి విషయాలు చెప్పడంతో కంగు తిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం కావడం మామూలేనని, అయితే ఇంతగా ఎప్పుడూ లేదని, మేజర్ సర్జరీ చేస్తే తప్ప పరిస్థితి చక్కబడదని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీరు పట్ల కూడా ఆజాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. డిఎస్ ఏమీ పట్టించుకోవడం లేదని ఆయన ఓ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వచ్చే ఒకటి రెండు నెలల్లో ఆజాద్ సూచన మేరకు మేజర్ సర్జరీకి శ్రీకారం చుట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
The Congress high command is thinking of a major surgical operation to refurbish the image of the party in the state which has taken a severe beating since the death of Y S Rajasekhar Reddy in September 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X