వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారిన చిరంజీవి స్టయిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
మృధుస్వభావి, సున్నిత మనస్కుడు, ఎవరినీ డైరెక్టుగా విమర్శించలేడు - ఇది పీఆర్పీ అధినేత చిరంజీవి స్వభావం, ఘాటైన వ్యాఖ్యలు, పరుషమైన పదాలు, మాటల్లో దూకుడు ఇది కాంగ్రెసు నేతగా మారిన చిరంజీవి స్వభావం. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం ప్రకటన తర్వాత చిరంజీవి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మెత్తగా మాట్లాడుతూ సున్నిత మనస్కుడిగా కనిపించే చిరంజీవి కాంగ్రెసు‌లోకి వచ్చాక తన గొంతు పెంచారు. 2009లో సాధారణ ఎన్నికల సమయంలో కూడా విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంలో కాస్త వెనుకాముందు ఆడాడు. ఆయన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ అభిమానులను, ప్రజలను ఆకట్టుకున్నారు. ఎన్నికలలో దారుణ పరాభవం తర్వాత కూడా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడి ప్రభుత్వంపై గానీ, విపక్షాలపైన గానీ విమర్శలు గుప్పించడంలో ఘాటైన వ్యాఖ్యలు లేకుండా ఉండేవి. పీఅర్పీ ఇతర నేతలే ఘాటుగా స్పందించేవారు.

అయితే పీఆర్పీ అధినేత చిరంజీవి కాంగ్రెసు పార్టీ నాయకుడిగా మారిన తర్వాత పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. చిరుకు మొహమాటు కూడా ఎక్కువే. అయితే కాంగ్రెసు‌లో 2014 ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అంటూ అభిమానులకు, ప్రజలకు పరోక్షంగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అంతేకాదు తన మాటల్లో కూడా దూకుడు పెంచారు. మాజీ పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నా అన్ని సీట్లు, ఓట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. కొత్తగా వచ్చిన పార్టీ 18 శాతం ఓట్లు, 18 సీట్లు గెలుచుకోవడం సాధారణ విషయం కాదని, అన్ని సీట్లు, ఓట్లు గెలుచుకోవాలని జగన్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెసు‌లో చేరి దివంగత సిఎం వైయస్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపైనా ఘాటైన వ్యాఖ్యలే చేస్తున్నారు.

పీఆర్పీ అధినేతగా చిరంజీవి ఎప్పుడూ మనం అంటూ, ప్రజారాజ్యం అంటూ మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం పూర్తి విరుద్దంగా మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో ఇప్పుడు నేను అంటూ మాట్లాడుతున్నారు. మీడియాపైన విసుర్లు వేస్తున్నారు. మొత్తానికి పీఆర్పీ అధినేతగా సున్నిత మనస్కుడైన చిరంజీవి ఇప్పుడు సౌండ్ పెంచడం ద్వారా తనకూ కాంగ్రెసు సంస్కృతి అబ్బిందని నిరూపించినట్టుగానే కనిపిస్తోంది. తాను పరుషంగా మాట్లాడితే జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెసు కాపాడుతుందో లేక పార్టీకి ఇప్పుడు తాను తప్ప ఎవరూ లేరనే విశ్వాసమో చిరులో ఉన్నట్టు ఉంది. ఆయితే ఆయనను కాంగ్రెసు వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటికే చిరు వ్యాఖ్యలపై కొందరు విభేదిస్తున్నారు.

English summary
Chiranjeevi changed his tone after PRP merger in Congress Party. As PRP president he was soft, as a Congress leader he is aggressive in his attack on Chandrababu, YSR and YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X