చిరంజీవి శాసనసభ్యులకు మొండిచేయే?

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులకు ఇప్పుడిప్పుడే మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ముగ్గురిని డిసెంబర్ నెలాఖరులోగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఆ ఆశతోనే ప్రజారాజ్యం శాసనసభ్యులున్నారు. అయితే, దాన్ని వాయిదా వేయడానికే కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ముందు పలు సమస్యలున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. అలాగే, రాష్ట్రంలో ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన సంకటంలో కూడా ఆయన పడ్డారు. పార్టీని, ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి మొత్తంగా మంత్రివర్గాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఏప్రిల్‌లో రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడే దానికి ఒడిగడితే సమస్యలను గట్టెక్కడం క్లిష్టంగా మారిపోతుంది. దీంతో మంత్రి వర్గ విస్తరణ లేదా పునర్వ్యస్థీకరణను వాయిదా వేయాలని అనుకుంటున్నారు.

శానససభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాన్ని విస్తరించే ఉద్దేశంతో ఉన్నారు. అప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఆగాల్సిందేనని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు నచ్చజెప్పేందుకు ఆయన ఓ సాకును కూడా వెతుక్కుంటున్నారు. చిరంజీవికి తగిన పదవి లభించిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటానని కిరణ్ కుమార్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు చెప్పడానికి సిద్ధపడ్డారు. ప్రజారాజ్యం పార్టీకి 17 మంది శానససభ్యులున్నారు. చిరంజీవిని మినహాయిస్తే 16 మంది ఉంటారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే మిగతా వారు ఆసంతృప్తికి గురయ్యే అవకాశాలున్నాయని, అది నష్టం చేస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి నచ్చజెప్పేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభ ఎన్నికలు, శాసనసభ బడ్జెట్ సమావేశాలు, ఉప ఎన్నికలు పూర్తయితే, తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడు మంత్రులందరి చేత రాజీనామాలు చేయించి, కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని 2014 ఎన్నికలకు సిద్ధం కావాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఈలోగా, తెలంగాణ అంశం కూడా తేలిపోతుందని అంటున్నారు. ఇక, వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావడం తప్ప మరో తలనొప్పి ఉండదని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+