తెలంగాణపై మారని చిరంజీవి

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత కూడా మెగా స్టార్ చిరంజీవి తన సమైక్య నినాదాన్ని వదులుకోలేదు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు సమైక్య నినాదాన్ని వదులుకోకపోతే తెలంగాణ ప్రాంతంలో అడ్డుకుంటామని హెచ్చరించినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. తాజాగా, తిరుపతిలో బుధవారంనాడు మళ్లీ సమైక్య నినాదాన్ని వినిపించారు. తిరుపతిలో విశాలాంధ్ర భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన సమైక్య నినాదం వినిపించారు. విశాలాంధ్ర అనే పేరు ఎంతో మధురంగా ఉందని, ఆ పేరు చిరకాలం అలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన అన్నారు.

తాను సమైక్య నినాదం ఇవ్వడమే కాకుండా పనిలో పనిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు ఆయన ఉచిత సలహా కూడా పారేశారు. సమైక్యవాదాన్ని బలపరిచేందుకు ముందుకు రావాలని ఆయన నారాయణకు సలహా ఇచ్చారు. విశాలాంధ్ర చిరకాలం ఉండే దిశగా నారాయణ ఆలోచన చేయాలని ఆయన సూచించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలపరుస్తున్న విషంయం తెలిసిందే. అందుకే చిరంజీవి నారాయణకు ఆ ఉచిత సలహా ఇచ్చారు.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత తాము సామాజిక తెలంగాణకు కట్టుబడుతామని చిరంజీవి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన వెంటనే మాట మార్చి సమైక్యవాద తీర్థం పుచ్చుకున్నారు. సమైక్యవాదంతో సీమాంధ్రలో పర్యటనలు కూడా చేశారు. కాంగ్రెసు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత ఆ వివాదంలోకి ఆయన వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన గొంతు విప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+