చిరు ఎంట్రీతో మారిన కాంగ్రెసు సమీకరణాలు

Botsa Satyanarayana-Chiranjeevi
చిరంజీవి తన ప్రజారాజ్యం విలీనం చేయడంతో కాంగ్రెసు పార్టీలో రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. రెడ్ల ఆధిపత్య పార్టీగా పేరు గడించిన కాంగ్రెసు పార్టీని కాపుల ఆధిపత్య పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. చిరంజీవి ఎంట్రీతోనే కాకుండా బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ ప్రయత్నాలు జోరందుకున్నాయి. పి.శివశంకర్‌, డి.శ్రీనివాస్‌, వి.హన్మంతరావు, కేశవరావు, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ వంటి కీలక శక్తులు దశాబ్దాల నుంచి పార్టీలో పనిచేస్తున్నప్పటికీ వారికి సీఎం పదవి చేపట్టే అవకాశం రాలేదని, ఈ స్థితిలో కాపులు అధికారం చేపట్టడానికి అవసరమైన వ్యూహాలు కాపుల్లో రూపుదిద్దుకుంటున్నాయని ఆ పత్రిక రాసింది. ఈ స్థితిలో తెలంగాణకు చెందిన మున్నూరు కాపులను సీమాంధ్రకు చెందిన కాపులు మానసికంగా తమతో కలుపుకోవడానికి సిద్ధపడ్డారు. బొత్స సాంకేతికంగా తూర్పు కాపు (బీసీ) అయినప్పటికీ, అధిష్ఠానం దృష్టిలో కాపు నేతగానే ముద్రపడ్డారు. ఆయన తన రాజకీయ మనుగడ కోసం కాపులతోనే ఎక్కువ సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాపులు సైతం ఆయనను తమ వర్గ నేతగానే అంగీకరిస్తున్నారు.

శివశంకర్‌ వంటి నేతకు దివంగత ఇందిరాగాంధీ తోనే సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కలేదని, వి.హన్మంతరావుకూ రాజీవ్‌, సోనియాల వద్ద పలుకుబడి ఉన్నప్పటికీ ఆయనదీ అదే పరిస్థితి అని, డి.శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, ఆ సమయంలో ఆయన చట్టసభల్లో సభ్యుడు కాకపోవడం, 2004లో గెలిచినప్పటికీ ఆయన అవకాశాన్ని వైఎస్‌ ఎగరేసుకుపోవడంతో కాపులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తృటిలో తప్పిపోయిందని ఆ పత్రిక రాసింది.

ఆ పత్రిక కథనం ప్రకారం - 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి కొత్త పార్టీ స్థాపించిన తర్వాత కాపు-బలిజ వర్గాల ఆలోచనా ధోరణిలో అనూహ్య మార్పు వచ్చింది. ఇంతవరకూ కాపుల నుంచి ఎవరూ సీఎం కాకపోవడం, చిరంజీవికి సినీగ్లామర్‌ ఉన్నందున ఆయన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున, చిరు ప్రజారాజ్యం పార్టీకి పట్టం కట్టాలని ఆ రెండు సామాజికవర్గాలు భావించాయి. అదేవిధంగా, తెలంగాణలో మున్నూరు కాపులు కూడా పీఆర్పీకి అనుకూలంగా మొగ్గు చూపారు. ఫలితంగా, అంతకుముందు కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించిన ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ వంటి జిల్లాల్లో ఓట్ల శాతం దెబ్బతిని, ఆ ఓట్లు పీఆర్పీకి పోలవడంతో కాంగ్రెస్‌కు సీట్లు-ఓట్లు దెబ్బతిన్నాయి. దీంతో కాపులను చేరదీసేందుకు వైయస్ రాజశేఖర రెడ్డి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయించే బాధ్యతను అప్పట్లో బొత్స సత్యనారాయణకు అప్పగించారు. అదే ఫార్ములా ఇప్పుడు అమలవుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఒక్కటిగా నడుస్తూనే బొత్స సత్యనారాయణ, చిరంజీవి పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+