బాబుపై విచారణ ఎందుకిలా?

దీంతో బాబు ఆస్తుల కేసు విచారణ అందరిలోనూ ఉత్కంఠను రేకిస్తోంది. జగన్ కాంగ్రెసు పార్టీని వీడిన తర్వాతే కక్ష సాధింపు చర్యగా ఆయనపై దర్యాఫ్తు ప్రారంభమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ బాబు అధికారానికి దూరమై ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత అదీ దివంగత ముఖ్యమంత్రితో సహా పలువురు ఆయనపై 26 వరకు కేసులు వేసి ఏమీ నిరూపించలేక పోయారనే వాదన టిడిపి నుండి వినిపిస్తున్నప్పటికీ ఇన్ని విచారణలు వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. బాబు కేసులో అందరూ బిగ్ షాట్సే.
బాబు ఆస్తులపై వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అంత తీవ్రంగా పరిగణించింది కాబట్టే ఇంతటి స్థాయి విచారణకు ఆదేశించారనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అక్రమాలు బయటపెట్టేందుకు సిబిఐ విచారణ జరుగుతుంది. అంతర్జాతీయ అక్రమాలు బయటపెట్టడానికి ఈడి రంగంలోకి దిగుతుంది. సిబిఐ, ఈడి, డిజిపి, హోం సెక్రటరీ ఇలా అందరి నివేదికలను కోర్టు పరిశీలించి పూర్తి దర్యాఫ్తుకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. అంతేకాకుండా సిబిఐకి ఇప్పటికే జగన్, గాలి కేసులు ఉన్నందున వారిపై భారం తగ్గించేందుకు కూడా మిగతా విచారణ సంస్థలను కోర్టు ఆదేశించినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications