జగన్ గెలిచాడా? ఓడిపోయాడా?

YS Jagan
తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలిచాడా? లేక ఓడిపోయాడా? అంటే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీపై యువనేతే విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెడితే మేం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని జగన్, ఆయన వర్గం పలుమార్లు టిడిపికి సవాల్ విసిరారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కైనందునే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదనే వాదననూ తెరపైకి తీసుకు వచ్చారు. అయితే జగన్‌ను ధాటిగా ఎదుర్కొనడంతో పాటు అవిశ్వాసం ద్వారా ప్రభుత్వ పాలన తీరును ఎండగట్టి ప్రజల్లో విశ్వాసం చూరగొనేందుకు టిడిపి అవిశ్వాసం పెట్టింది. తాము అవిశ్వాసం పెడితే వేటు భయం కారణంగా జగన్ వర్గంలో అత్యధిక ఎమ్మెల్యేలు తమకు మద్దతివ్వరని తద్వారా జగన్ వర్గం నైతికత ప్రజల ముందు పెట్టవచ్చునని టిడిపి భావించింది.

అవిశ్వాస తీర్మానం సమయం వరకు జగన్ ఎమ్మెల్యేల్లో కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని పలువురు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు ఇటీవల మాట్లాడిన తీరు చూసినా కొందరిలో అవిశ్వాసానికి మద్దతిచ్చే అంశంపై అనుమానాలు కలిగాయి. కానీ చివరకు తనతో రెండు రోజులుగా భేటీ అవుతున్న ఎమ్మెల్యేలచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించడం ద్వారా జగన్ విజయం సాధించారు. తద్వారా ఇన్నాళ్లూ తాను చెప్పిన నైతికతను ఆయన నిరూపించుకున్నారని ఆయన వర్గం నేతలు భావిస్తున్నారు. జయసుధ, కుంజా సత్యవతి తదితర ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెసులో ఉంటామని ప్రకటించారు. దీంతో వారిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

అవిశ్వాసం ద్వారా జగన్, కాంగ్రెసు ఒక్కటే అని నిరూపించాలనుకున్న టిడిపి ఇందులో విఫలమైందనే చెప్పవచ్చు. అవిశ్వాసం ద్వారా వస్తుందనుకున్న క్రెడిబిలిటీ టిడిపికి రాలేదు. కేవలం ప్రజా సమస్యలు, తెలంగాణ అంశాలు ప్రాస్తావించడంలో మాత్రమే విజయం సాధించారు. కాని జగన్ విషయంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే అసెంబ్లీలో జగన్ బలమెంతో ఓ అవగాహన రావడానికి మాత్రం టిడిపి, ప్రభుత్వానికి ఈ వేదిక ఉపయోగపడిందనే చెప్పవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్ బలాన్ని తేల్చడానికే ఈ అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చిందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+