కోదండరామ్ పవర్ తగ్గుతోందా?

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కోదండరామ్ విషయంలో అదే అభిప్రాయంతో ఉన్నాయి. తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు బహిరంగంగానే ఆ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులతో కలిపి తెలంగాణ జెఎసి ఏర్పడింది. క్రమక్రమంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దాని నుంచి బయటపడ్డాయి. న్యూడెమొక్రసీ, బిజెపిలు మాత్రం అందులో కొనసాగుతున్నాయి. తెలంగాణ జెఎసిలో న్యూడెమొక్రసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. తెరాసతో విభేదిస్తూ ఉద్యమానికి పదును పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
కాగా, తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జూన్ 25వ తేదీలోగా రాజీనామాలు చేయాలని కోదండరామ్ డెడ్‌లైన్ పెట్టారు. కానీ, ఆ డెడ్‌లైన్‌ను ఎవరూ పాటించలేదు. ఓ డెడ్‌లైన్ ఉన్నట్లు కూడా గుర్తించినట్లు లేదు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయకపోవడం వల్ల తలెత్తిన పరిణామాలు కూడా ఏమీ లేవు. దీంతో తెలంగాణ జెఎసి బలహీనపడుతోందనే అభిప్రాయం బలపడే ప్రమాదం ఉంది. కెసిఆర్ సూచనల మేరకే కోదండరామ్ పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగానే జెఎసిని నడిపిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. దీన్ని తొలగించుకోవాల్సిన అవసరం కోదండరామ్‌కు ఉంది.












Click it and Unblock the Notifications