వైయస్ జగన్‌ది ధర్మయుద్ధమా?

కానీ, సిబిఐ విచారణను వ్యతిరేకించడం వల్ల జగన్ నిజాయితీపరుడు అవుతారా, సిబిఐ విచారణకు వ్యతిరేకంగా జగన్, ఆయన వర్గం నాయకులు పోరాటం చేయడం ధర్మయుద్ధమవుతుందా అనేవి ప్రశ్నలు. జగన్ తన ఆస్తుల విషయంలో, పెట్టుబడలు విషయంలో పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఇటువంటి వాదన చేసి ఉండేవారా అనేది మరో ప్రశ్న. జగన్ విచారణలో క్లీన్‌గా బయటపడుతారని కొంత మంది జగన్ వర్గం నాయకులు జోస్యం చెబుతున్నారు. అలా బయటపడితే జగన్‌కే మేలు జరుగుతుంది. మరింతగా జనాదరణ పెరుగుతుంది. కానీ, ఇప్పుడు సిబిఐ విచారణను వ్యతిరేకించడంలో అర్థం లేదు.
జగన్ వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు సోమవారం రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలకు చెబుతున్న కారణం కూడా హేతుబద్దంగా లేదు. వైయస్సార్‌ను దోషిగా నిలబెడుతున్నారనేది వారి వాదనలో ముఖ్యమైంది. వైయస్సారే కాదు, ఎవరిమీదనైనా విచారణ జరగాల్సిందేనని విషయాన్ని అందరూ నిర్ద్వంద్వంగా అంగీకరించాల్సిన విషయం. అదే విధంగా వైయస్ మృతిపై అనుమానాలున్నాయని వాదిస్తున్నారు. వైయస్సార్‌ను దోషిగా నిలబెట్టడం, వైయస్సార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం అనే అంశాలు ఎంత మాత్రం సిబిఐ విచారణకు సంబంధించిన అంశాలు కావు. సిబిఐ విచారణకు వ్యతిరేకంగా జగన్ గానీ జగన్ వర్గం గానీ చేసే యుద్ధం ఎంత మాత్రమూ ధర్మయుద్ధం కాదు.












Click it and Unblock the Notifications