హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: ఐటి కంపెనీల మొత్తుకోలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hitech City
తెలంగాణ వివాదంతో హైదరాబాదులోని ఐటి కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఐటి కంపెనీల ప్రతినిధులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిశ్చయించుకున్నారు. తమ పథకాల ప్రారంభానికి, తమ సంస్థల విస్తరణకు తెలంగాణ సమస్య తీవ్రమైన ఆటంకం కలిగిస్తోందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తరుచుగా సమ్మెలు జరుగుతుండడంతో విద్యుత్తు సరఫరాకు, రవాణాకు అంతరాయం కలుగుతోంది. సకల జనుల సమ్మె తీవ్రమవుతున్న నేపథ్యంలో శుక్రవారంనాడు పది, పన్నెండు ఐటి కంపెనీల ప్రతినిధులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

తెలంగాణ ఆందోళన వల్ల నిత్యావసర సేవకు అంతరాయం కలుగుతోందని ఐటి కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. వరుసగా ఆందోళనలు చెలరేగుతుండడంతో విస్తరణ ప్రణాళికలు కూడా ఆగిపోతున్నాయి. మరిన్ని నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాదులో ఐటి పరిశ్రమ కొనసాగడం కష్టమవుతుందని, ఐటికి అనువైన ప్రదేశంగా హైదరాబాదు ఉండబోదని అంటున్నారు. సకల జనుల సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె కారణంగా ఐటి బెల్టు ఉన్న మాదాపూర్‌లో రోజుకు ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. రెండు గంటలు అధికారికంగా విద్యుత్తును కోత విధిస్తుండగా, తరుచుగా విద్యుత్తు సరఫరాకు అనధికారికంగా కోత పడుతోంది. బ్యాకప్ పవర్ సప్లయ్‌‍ని కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల కోసం క్యాబ్స్ నడుపుతున్నాయి.

కాగా, తాజాగా ఐటి కంపెనీలకు మరో దెబ్బ పడింది. సోమవారం ఐటి కంపెనీలకు వెళ్తున్న ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. హైదరాబాదులో ఐటి కంపెనీలు ఉన్న ప్రాంతంలో తెలంగాణవాదులు మోహరించి ఐటి ఉద్యోగులను అడ్డుకున్నారు. ప్రభుత్వం వారికి రక్షణ కల్పించలేని స్థితిలో ఉంది. మొత్తం మీద హైదరాబాదులో ఐటి పరిశ్రమ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కుంటోంది.

English summary
IT companies in Hyderabad are planning to approach the Centre as the uncertainty due to the ongoing Telangana issue has seriously hampered start-ups and expansion plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X