తెలంగాణపై కిరణ్, బాబు కుమ్మక్కు?

Kiran Kumar Reddy-Chandrababu Naidu
ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి‌తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇటు తెలంగాణను అడ్డుకొని సమైక్యరాష్ట్రంగా ఉంచడంతో పాటు, అటు సీమాంధ్రలో జగన్ వర్గాన్ని అడ్డుకునే యత్నంలో వీరిద్దరు కుమ్మక్కయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి, చంద్రబాబు కుమ్మక్కయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్‌రావు, జగన్ వర్గం నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎన్డీయే హయాంలో చంద్రబాబు తెలంగాణను అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి‌కి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు.

ఎన్డీయే హయాంలో తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుండా అడ్డుకోవటంనుంచి చంద్రబాబు ప్రత్యేక వాదానికి అడ్డు పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణ అంశాన్నికేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటిస్తే తమకేమీ అభ్యంతరం లేదని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల నిర్ణయాలు తీసుకున్న అనంతరం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించింది. అప్పటిదాకా తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెప్పిన చంద్రబాబు చిదంబరం ప్రకటన తర్వాత కేంద్రం తెలంగాణ ప్రకటన ఆర్ధరాత్రి చేయడాన్ని తప్పు పట్టారు. అయితే అంతర్గతంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వ్యతిరేకించినట్టుగానే తెలంగాణవాదులు భావించారు.

ఆ సమయంలోనే చంద్రాబాబు ఇటు కాంగ్రెసు, అటు తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులతో రాజీనామాలకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. చిదంబరం ప్రకటన వెలువడటంతోనే టిడిపి, కాంగ్రెసు పార్టీ నేతలు వరుస రాజీనామాలు కేంద్రానికి వణుకు తెప్పించాయి. మొట్టమొదట రాజీనామా చేసిన అనంత ఎమ్మెల్యే, మాజీమంత్రి జెసి దివాకర్‌రెడ్డి వెనుక కూడా చంద్రబాబు పాత్ర ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇలా చంద్రబాబు పలుమార్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడుతున్నారు. అభివృద్ధి పేరుతో తెలంగాణను అడ్డుకోవడానికి కూడా కిరణ్ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కిరణ్‌తో కూడా చంద్రబాబు కుమ్మక్కయి తెలంగాణను అడ్డుకోవడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి తెలంగాణకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నేతలతో కూడా సమైక్యాంధ్రకు జైకొట్టించ వచ్చనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ప్రత్యేక శాఖ కోరిన తెలంగాణ టిడిపి వారు కూడా చంద్రబాబు వద్దని వారించడంతో మెత్తబడిన విషయం తెలిసిందే. అవసరమైతే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు. నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకుంటే రాజీనామాలు అని బీరాలు పలికిన తెలంగాణ కాంగ్రెసు నేతలు ఇప్పుడు రాజీనామాలకు వెనక్కి వెళ్లడానికి కూడా కారణం ముఖ్యమంత్రి కిరణ్‌ కారణమని భావిస్తున్నారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఎఫెక్టుతో మైనార్టీలో పడిన కిరణ్ సర్కారుపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టక పోవడానికి కారణం కూడా వారు కుమ్మక్కయినందునే అనే ఆరోపణలు వస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంలో కిరణ్ తన బలాన్ని నిరూపించుకోకుంటే ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో తెలంగాణవాదం కారణంగా, సీమాంధ్రలో జగన్ కారణంగా కాంగ్రెసు‌గానీ, టిడిపిగానీ చాలా తక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ కారణంగానే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షంలోనైనా కూర్చోవడానికి సిద్ధపడుతున్నాడు. కాని ఎన్నికలకు మాత్రం వెళ్లడానికి సిద్ధపడటం లేదు. అవిశ్వాసం పెట్టకుండా ఉండి కిరణ్‌కు చంద్రబాబు పరోక్ష మద్దతు ప్రకటిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+