• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజా, కనిమొళి వెరీ వెరీ క్లోజ్

By Srinivas
|

Kanimozhi
2జి స్పెక్ట్రం కుంభకోణం కారణంగా కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి గారాలపట్టి కనిమొళి పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి. వారి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ తమిళనాడు పత్రికలు కోడై కూస్తున్నాయంట. డిఎంకె రాజ్యసభ సభ్యురాలు అయిన కనిమొళి ఎ.రాజాకు ఇచ్చినంత ప్రాధాన్యత తన భర్త అరవిందన్‌కు కూడా ఇవ్వడం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. రాజా, కనిమొళిల అనుబంధం ఈనాటిది మాత్రమే కాదంట. వారిద్దరు మధ్య చాలాకాలంగా సాన్నిహిత్యం అనంతరం ప్రేమ వ్యవహారం కూడా నడిచిందని, ఇంకా నడుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కనిమొళి, రాజాలు రచయితలే కాకుండా ఇద్దరి భావజాలం ఒక్కటే అయినందున వారిద్దరి మధ్య సాన్నిహిత్యం అంతకంతకు పెరుగుకుంటూ వచ్చిందంట. 1968లో పుట్టిన కనిమొళి 1989లో శివకాశికి చెందిన ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి పెటాకులుకావడంతో 1997లో సింగపూర్‌కు చెందిన అరవిందన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అదీ సాఫీగా సాగటం లేదనే తెలుస్తోంది. రాజాకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా భర్త అరవిందన్‌కు కనిమొళి ఇవ్వదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రధానికి ఇష్టం లేక పోయినప్పటికీ రాజా కోరుకున్న టెలికాం శాఖను కనిమొళి తన తండ్రిచే ఒప్పించి ఇప్పించింది.

రాజా చెన్నైలో ఉన్నప్పుడు కనిమొళి ఇంట్లోనే బస, కనిమొళి కూడా తరుచూ రాజా క్యాంపు కార్యాలయానికి వెళ్లే వారంట. పార్టీలో పలు నిర్ణయాలు కూడా రాజా, కనిమొళి కలిసే తీసుకునే వారంట. రాజా మంత్రి అయ్యాక కలైంజ్ఞర్ టీవికి అనుమతులు ఇప్పించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్పేక్ట్రం కుంభకోణంలో ఇరుక్కు పోయారు. టాటా - నీరా రాడియా మధ్య జరిగిన సంభాషణ టేపులలో రాజా - కనిమొళి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయంట. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా గతంలో వచ్చినప్పటికీ కనిమొళి గానీ, రాజా గానీ ఖండించలేదంట. అంతేకాదు రాజా - కనిమొళి మధ్య ప్రేమ సంగతి తెలిసిన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి రాజాను తన చిట్టి చెల్లెలితో తిరగవద్దని హెచ్చరించారంట. చెన్నై విమానాశ్రయంలో కొట్టినంత పని కూడా చేశారు. డిఎంకె పార్టీ నుండి రాజాను బహిష్కరించాలని అళగిరి తన తండ్రి కరుణానిధిపై ఒత్తిడి తీసుకు రాగా, కనిమొళి చర్యలు తీసుకుంటే బావుండదని తండ్రిని హెచ్చరించారు. రాజా మధ్య అన్నాచెల్లెలు, తండ్రి బిడ్డల మధ్య కూడా పలు మార్లు విభేదాలు పొడసూపాయి.

మూడు నెలలుగా తీహార్ జైలులో ఒంటరిగా విచారంగా కనిపించిన రాజా కనిమొళి కూడా జైలుకు రాగానే ఉత్సాహంగా కనిపించారంట. ఇదంతా కనిమొళి మాయే అని అభిప్రాయపడే వారున్నారు. కనిమొళి కూడా తీహార్ జైలుకు వెళ్లడానికి, కోర్టుకు వెళ్లడానికి మొదట భయపడిందంట. అయితే రాజా సూచనల మేరకు ఆమె ఇప్పుడు భయపడటం లేదంట. మూణ్ణెళ్ల క్రితం వరకు బయట లవ్ ఎఫైర్ నడిపిన రాజా, కనిమొళిలు ఇప్పుడు జైలులో ప్రేమ పక్షులుగా మారి పోయారంట. ప్రస్తుతం వారు జైలులోనే తమ పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారంట. దీంతో వారు జాలీ జీవితం గడుపుతున్నారంట. అంతేకాదు వీరి లవ్ ఎఫైర్ కథాంశంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఓ చిత్రాన్ని కూడా నిర్మించడానికి సిద్ధమయిందంట. ఇందుకు అనుమతులు కూడా తీసుకుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో రొమాన్స్ కన్నా ట్రాజెడీ సన్నివేశాలే ఎక్కువ ఉంటాయంట.

English summary
The allegations revealed that love affair between Kanimozhi and Raja who were sent to teehar jail in 2g spectrum scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X