వైయస్ జగన్ అరెస్టుకు ఒత్తిడి?

వైయస్ జగన్ వర్గానికి చెందిన 26 మంది శానససభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకులు అప్రమత్తమయ్యారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరింత మంది వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. శాసనసభ్యులతో మాట్లాడాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి జిల్లా ఇంచార్జీ మంత్రులకు అప్పగించారు.
కాగా, రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శానససభ్యులు తీవ్ర నిస్పృహతో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమ రాజీనామాలు ఆమోదిస్తారేమోననే ఆందోళనకు వారు గురవుతున్నట్లు చెబుతున్నారు. కొంత మంది తమ రాజీనామాలు ఆమోదం పొందకుండా చూడాలని సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు, కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్‌పై ఎదురుదాడికి దిగారు. వైయస్సార్‌కు అత్యంత సన్నిహితులైన మంత్రులు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైయస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. మొత్తం మీద, వైయస్ జగన్‌ను తిప్పికొట్టడానికి అవసరమైన మార్గాలను కాంగ్రెసు నాయకులు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications