వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచారణలు: చంద్రబాబు వర్సెస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Chandrababu Naidu
హైకోర్టు ఆదేశాల వల్ల రాష్ట్రంలో రాజకీయ సమరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వర్రెస్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌గా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణను, ఇతర సంస్థల విచారణను ఈ ఇద్దరు నాయకులు కూడా ఎదుర్కోవాల్సిందే. కానీ తమపై పిటిషన్లు వేయడంపై, వాటిపై హైకోర్టు విచారణలకు ఆదేశించడంపై వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తనపై హైకోర్టు విచారణకు ఆదేశించినప్పుడు వైయస్ జగన్ - కాంగ్రెసునే నిందించారు. కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. సరిగ్గా ఇవే మాటలు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెసు పెద్దలు వైయస్ విజయమ్మ చేత చంద్రబాబుపై పిటిషన్ వేయించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

పిటిషన్లు వేసినప్పుడు, వాటిపై హైకోర్టు విచారణలకు ఆదేశించినప్పుడు ఏ తప్పూ చేయకపోతే ఎదుర్కోవడానికి సిద్ధపడతారని అందరూ అనుకునే మాట. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనప్పుడే విమర్శలు ముందుకు వస్తాయని అంటున్నారు. గతంలో జగన్‌పై చేసిన ఈ వాదన సరిగ్గా ఇప్పుడు చంద్రబాబుకు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు. గుడ్డిలో మెల్లలా చంద్రబాబుకు కలిసి వచ్చే అంశం ఏమిటంటే - హైకోర్టు విచారణకు ఆదేశించే ముందు చంద్రబాబు వాదనలను వినకపోవడం. దాన్ని ఆసరా చేసుకుని హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుకు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సిబిఐని తాజాగా, అంటే చంద్రబాబు ఆస్తులపై హైకోర్టు విచారణకు ఆదేశించిన తర్వాత, వైయస్ జగన్ కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్‌గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యనే చంద్రబాబు చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. అయితే, జగన్‌పై సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత చంద్రబాబుతో పాటు తెలుగు తమ్ముళ్లు కాస్తా బాణీ మార్చారు. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ జరుగుతోంది కాబట్టి నిష్పాక్షికంగా జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పుడు కూడా హైకోర్టు ఆదేశాల మేరకే చంద్రబాబు ఆస్తులపై విచారణ జరగనుంది. ఇప్పుడు కూడా అదే రీతిలో నిష్పాక్షికంగా సిబిఐ విచారణ జరుగుతుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనడం లేదనేది ప్రశ్న. మొత్తం మీద, రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రధాన నాయకులు చంద్రబాబు, వైయస్ జగన్ సిబిఐ విచారణల చిక్కుల్లో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్నారని చెప్పక తప్పదు.

English summary
AS the High Court ordered for probe on TDP president N Chandrababu Naidu's assets, the political war began between YSR Congress president YS Jagan and the former.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X