శ్రీరాముడు విలన్‌గా వర్మ సినిమా

ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ వాల్మీకి రామాయణాన్ని రామాయణ కల్పవృక్షం పేర తెలుగులో కావ్యం రాశారు. రాముడి కథలు తెలుగు సాహిత్యంలో చాలానే వచ్చాయి. శ్రీరాముడిని మానవోత్తముడిగా, దైవంగా కీర్తిస్తూ రచనలు వచ్చాయి. అయితే, రంగనాయకమ్మ అనే రచయిత్రి రాముడిని విలన్‌గా చూపిస్తూ రామాయణ విషవృక్షం అనే రచన చేశారు. ఈ రామాయణ విషవృక్షం హక్కులు తనకు ఇస్తే సినిమా తీస్తానని రామ్‌గోపాల్ వర్మ అంటున్నారు.
వాల్మీకి రామాయణం కథను తలకిందులు చేస్తూ రంగనాయకమ్మ తెలుగులో రామాయణ విషవృక్షం రచన చేశారు. రావణుడిని రాక్షసుడిగా కాకుండా సాధారణ మానవుడిగానే భావిస్తూ ఆమె రచన చేశారు. లక్ష్మణుడి చేతిలో ముక్కు చెపులను కోల్పోయిన రావణుడి సోదరి శూర్పణఖను అత్యంత సౌందర్యవతిగా చిత్రించారు. ఆ సౌందర్యానికి సీత అసూయ పడడం వల్లనే శూర్పణఖ ముక్కుచెపులను లక్ష్మణుడు కోసేశాడని ఆమె రాశారు. మొత్తంగా, రావణుడు ఉత్తమ పురుషుడిగా, రాముడు స్వార్థపరుడిగానూ మహిళా వ్యతిరేకిగానూ రామాయణ విషవృక్షం రచనలో కనిపిస్తారు.












Click it and Unblock the Notifications