పుట్టపర్తి సత్య సాయిబాబా మహిమలు చేయడం ప్రారంభించారనే ప్రచారం ఊపందుకుంటోంది. సత్య సాయిబాబా ఆత్మ పుట్టపర్తిలోనే సంచరిస్తోందని అంటున్నారు. మరణం దేహానికే తప్ప ఆత్మకు లేదని సత్య సాయిబాబా తన ఉపదేశంలో పదే పదే చెప్పేవారు. అందుకు అనుగుణంగానే సత్య సాయి తన దేహాన్ని మాత్రమే వదిలేశారని భక్తులు నమ్ముతున్నారు. డాక్టర్ సఫాయా నివాసంలో మంగళవారం పాము కనిపించింది. సఫాయా సత్య సాయిబాబాకు శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సఫాయా నివాసం కూడా ఈ ఆస్పత్రి ఆవరణలోనే ఉంటుంది. అందువల్ల బాబా ఆత్మ పాము రూపంలో సఫాయా ఇంటికి వచ్చిందని భక్తులు విశ్వసిస్తున్నారు. పామును సఫాయా వ్యక్తిగత సహాయకుడు పట్టుకుని బయట వదిలేశాడు.
కాగా, సత్య సాయి బాబా మహా సమాధి సందర్భంగా పుట్టపర్తిలో పట్టపగలు ఆకాశంలో చంద్రవంక కనిపించింది. దీన్ని కూడా బాబా మహిమగానే భక్తులు పరిగణిస్తున్నారు. తాను భూమి నుండి ఆకాశానికి ప్రయాణం చేయడాన్ని స్పష్టంగా చూస్తారని బాబా చెప్పాడు. అందువల్లనే చంద్రవంక ఆకాశంలో బాబా మహా సమాధి సందర్భంలోనే కనిపించిందని అంటున్నారు. ఇంతేకాకుండా మరిన్ని బాబా మహిమకు సంకేతాలుగా సంఘటనలను చూపిస్తున్నారు. హైదరాబాదులోని శివం సమీపంలో ఓ భక్తురాలికి దివ్య జ్యోతి సందర్శనం జరిగిందని ప్రచారం జరుగుతోంది. కొన్ని గంటల పాటు ఆ దివ్య జ్యోతి ఉందని చెబుతున్నారు.
కాగా, కదిరిలో సత్య సాయిబాబా విగ్రహం నుంచి విభూది వెలువడినట్లు ప్రచారం జరిగింది. ఇటువంటి సంఘటనలే మరిన్ని ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఈ సంఘటనలను సత్య సాయిబాబా మహిమలుగా చెప్పడాన్ని హేతువాదులు, శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు. సత్య సాయి బాబా వ్యక్తిత్వాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదని అంటూ సఫాయా ఇంటికి పాము రావడం సాధారణ సంఘటన అని అంటున్నారు. అలాగే, పగటి పూట చంద్రుడు ఏ కారణాల వల్ల కనిపిస్తాడో వివరించే ప్రయత్నం చేశారు.
Devotees are campaigning that Sathya Sai baba is showing his miracles after his death. Appearance of moon on the sky and snake in Safaya's residence are apparent for that.
Story first published: Wednesday, April 27, 2011, 15:03 [IST]