• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సత్యసాయి సేవలు ప్రపంచవ్యాప్తం

By Srinivas
|

Sathya Saibaba
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవలు అమోఘం. సత్యసాయిబాబా సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అంతేకాకుండా ఆయన పుట్టిన గడ్డకు చేసిన సేవలు ఎవరూ మరువలేనివి. పుట్టపర్తిలో విశ్వవిద్యాలయాలు, వైద్యశాల, నీటి ప్రాజెక్టులు చేపట్టి సేవా భావం తన భక్తులలోనూ పెంపొందించారు. ఆయన ఆధ్యాత్మికతకు, సేవాభావానికి మాజీ రాష్ట్రపతి, అబ్దుల్ కలాం, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి, కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి గీతారెడ్డి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కూడా దాసోహం అయ్యారు.

వారు బాబాకు పరమ భక్తులు. సత్యసాయి 80వ పుట్టివ రోజుకు మనదేశంతో పాటు, 180 దేశాల నుండి 13,000 మంది ప్రముఖులు హాజరయ్యారంటే ఆయన సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరించాయో అర్థం చేసుకోవచ్చు. బాబా ముఖ్యంగా మూడు ఆధ్యాత్మిక కేంద్రాలను మొదట దేశవ్యాప్తంగా నిర్మించారు. 1968లో ముంబయిలో సత్యం, 1973లో శివం, 1981లో చెన్నైలో సుందరం ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మించారు. బాబా అందరినీ ప్రేమించమని చెప్పేవారు. ప్రేమను పంచుతూ సేవను అందించడమే ఆయన ముఖ్య ఉద్దేశ్యం.

సత్యసాయి పుట్టపర్తిలో విద్యాసంస్థలు స్థాపించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు విద్యను బోధింపజేసేవారు. అందులో విద్యాభ్యాసం ఉచితంగా ఉంటుంది. పుట్టపర్తిలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి ఉచిత వైద్యాన్ని పేదలకు అందించేవారు. బాబా సేవలు కేవలం మన రాష్ట్రంలోనే, మన దేశానికే పరిమితం కాలేదు. బాబా సేవలు 166 దేశాలకు వ్యాప్తి చెందాయి. అందుకే ఆయనకు ఎవరికీ లేనంతగా 180 దేశాల్లో భక్తులు ఉన్నారు. బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి యూనివర్శిటీకి ఎ ప్లస్ ప్లస్ రేటింగ్ వచ్చింది. అలాంటి ఉన్నత విద్యను అక్కడ బోధిస్తారు. సత్యసాయి యూనివర్శిటీకి బాబానే చాన్సలర్.

శ్రీ సత్యసాయి మిర్పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ పేరిట సంగీత కళాశాలలు కూడా బాబా ఏర్పాటు చేశారు. బాబా స్థాపించిన విద్యాసంస్థల ముఖ్య ఉద్దేశ్యం విద్యతో పాటు సేవాభావం, ప్రేమ, ప్రతిభను పెంపొందించడం. మద్దెనహల్లి - సత్యసాయి లోక సేవా స్కూల్, శ్రీ సత్యసాయి లోక సేవా ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్‌ను కనివెనారాయణపుర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సత్యసాయి బాబా విశ్వవిద్యాలయం మరియు మెడికల్ స్కూల్ కూడా వరల్డ్ క్లాస్ హాస్పిటల్‌గా పేరు గాంచింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 220 పడకల సౌకర్యం ఉంది.

ఈ హాస్పిటల్‌ను దివంగత ప్రధాని పివి నరసింహారావు ప్రారంభించారు. రాష్ట్రంలో తొలి అటామనస్ యూనివర్శిటీ సత్యసాయి యూనివర్షిటీయే. సత్యసాయి మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేశారు.

బెంగుళూరులో ఉన్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ 333 పడకల సౌకర్యం కలది. దీనిని నాటి ప్రధాని వాజపేయి ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో ఇప్పటి వరకు 2,50,000 మందికి పైగా పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించింది. వైద్యశాలను తన తల్లి ఈశ్వరమ్మ కోరిక మేరకు బాబా నిర్మించారని చెబుతారు. అయితే తల్లికి ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆయన చిన్న హాస్పిటల్ కాకుండా ఎన్నోరెట్లు పెద్దది నిర్మించారు. ఇక శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వివిధ రంగాలలో సేవలు అందిస్తోంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా పెద్ద పెద్ద నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు.

1996లో మొదటి నీటి ప్రాజెక్టు ప్రారంభం అయింది. ఆ ప్రాజెక్టు అనంతపురం జిల్లాలోని 750 గ్రామాలలో 1.2 మిలియన్ ప్రజలకు అది దాహార్తిని తీర్చింది. రెండో నీటి ప్రాజెక్టు 2004లో చెన్నైలో చేపట్టారు. ఆ తర్వాత మెదక్ జిల్లాలో కూడా దాహార్తిని తీర్చారు. మెదక్ జిల్లాలో 179 గ్రామాలలో 4,50,000 ప్రజలకు, మహబూబ్‌నగర్ జిల్లాలో 141 గ్రామాలలో, 3,50,000 ప్రజలకు దాహార్తిని తీర్చారు. మహారాష్ట్రలోని లాతూరు కూడా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఒరిస్సాలోని వరద బాధితులకు 699 ఇళ్లు కట్టించారు.

సత్యసాయి విద్యాసంస్థలు 33 దేశాల్లో వ్యాపించాయి. ఆస్ట్రేలియా, మెక్సికో, యునైటెడ్ కింగ్ డమ్ తదితర దేశాల్లో బాబా స్థాపించిన విద్యాసంస్థలు ఉన్నాయి. సత్యసాయి సంస్థలలో మానవతా విలువలకు ప్రాధాన్యం ఇస్తారు. కెనడాలో సాయి స్థాపించిన ఫ్రాజర్ ఇన్స్టిట్యూట్ ఒంటారియోలోని టాప్ 37 పాఠశాలలో ఒకటి. సత్యసాయి విద్యా సంస్థలు విద్యా ప్రామాణికతలో 10కి 10 స్కోర్ చేస్తుంది. బాబా తీరుస్తున్న దాహార్తిపై భారత ప్రభుత్వం 1999లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.

2001 నవంబర్ 23న రేడియో సాయి గ్లోబల్ హార్మనీ పేరుతో ఓ డిజిటల్ రేడియో నెట్ వర్క్ ప్రపంచ వ్యాప్తంగా ఆవిర్భవించింది. ఇది అమెరికాలో ఉంది. ఈ రేడియో సాయి బాబా శాంతి సందేశాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి నియోగించబడినది. 2007లో చెన్నై ప్రజల దాహార్తిని తీర్చడం కోసం కృష్ణా ప్రాజెక్టు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా సాయి సేవా కేంద్రాలు ఉన్నాయి.

English summary
Sathya Sai Baba supports a variety of free educational institutions, hospitals, and other charitable works in over 166 countries. The Sri Sathya Sai University in Prashanthi Nilayam is the only college in India to have received an A++ rating by the National Assessment and Accreditation Council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X