వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా ప్లాన్‌కు చిరు అస్త్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
రాష్ట్ర రాజకీయాల్లో సమూలమైన మార్పులు తెచ్చేందుకు చిరంజీవి ద్వారా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కొంత మంది బిసి నాయకుల సూచనల మేరకు ఆ ప్లాన్‌ను సోనియా అమలు చేయడానికే అంత ప్రాముఖ్యం ఇచ్చి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు అగ్రకులాలు మాత్రమే రాజ్యాధికారంలో ఉన్నాయని, రెడ్లు, కమ్మలు మాత్రమే రాజ్యం చేస్తున్నారని దళిత బహుజనులు చాలా కాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అందులో వాస్తవం కూడా ఉంది. ఈ కారణంగానే ముఖ్యమంత్రిగా రోశయ్య మనుగడ సాగించలేకపోయారనే అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే రెడ్డి వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసి తన ఆపరేషన్‌ను సోనియా గాంధీ వేగవంతం చేసినట్లు చెబుతున్నారు.

కోస్తాంధ్ర కమ్మ సామాజిక వర్గానికి ప్రత్యర్థి సామాజిక వర్గం కాపులను చేరదీయాల్సిన అవసరం, తెలంగాణలో రెడ్లకు వ్యతిరేకంగా వెలమ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెసు పార్టీకి ఏర్పడిందని అంటున్నారు. తెలంగాణలోని వెలమలు, కోస్తాంధ్రలోని కాపులు కలిస్తే రాష్టంలోని రెండు అగ్రకులాలను అధికారానికి దూరం చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని సోషలిస్టులు చాలా కాలంగా అంచనాలు వేస్తూ వస్తున్నారు. ఇందులో బిసి అంశం కూడా ఉంది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన పక్కన సోషలిస్టులు ఉన్నారు. వారి సలహాల మేరకు తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా బిసిలను, దళితులను ఆయన ఎక్కువగా ప్రోత్సహించారు. అందుకే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి బిసిల మద్దతు ఏదో మేరకు ఉంది. వెలమ, కాపులకు తోడు బిసిలు కూడా కలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చుననే అంచనా ఉంది. అందుకు అనుగుణంగా సామాజిక వర్గాల సమీకరణకు కాంగ్రెసు అధిష్టానం పూనుకున్నట్లు, అందులో భాగంగానే చిరంజీవిని పార్టీలోకి అహ్వానించినట్లు చెబుతున్నారు.

కోస్తా కాపులను బిసిల్లో చేర్చాలని చాలా కాలంగా కాపునాడు వంటి సంస్థలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మున్నూరు కాపు, ఇతర ప్రాంతాల్లో శెట్టిబలిజ, తదితర కులాలు కూడా కాపులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అంచనా. ఈ మేరకే వి. హనుమంతరావు, కె. కేశవరావు, డి. శ్రీనివాస్ వంటి బిసి నాయకులు చిరంజీవిని పార్టీలోకి తీసుకురావాలని సలహాలు ఇచ్చి, ఆ ప్రక్రియను పూర్తి చేయించినట్లు సమాచారం. వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి అంతకు మించిన మార్గం లేదని వారు సూచించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కూడా కలుపుకుంటే ఆపరేషన్ పూర్తవుతుదని, ఆ రెండు సామాజిక వర్గాల ఆధిపత్యానికి గండి పడడమే కాకుకండా కాంగ్రెసుకు గట్టి పునాది ఏర్పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Congress supremo Sonia Gandhi planned to wash out two dominant castes in AP through Chiranjeevi. She wants to use Chiranjeevi as weapon to over through Reddys and Kammas from power in the state. She believes in combination of Velama, Kapu and bcs will may yield result in ensuing election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X