వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి సిఎం కోరిక నెరవేరుతుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి మెగా ఆశలతోనే రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలనే ఆశ కారణంగానే ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారనేది జగమెరిగిన సత్యం. అయితే, ప్రజారాజ్యం పార్టీ మెగా ఫ్లాప్ కావడంతో ఆయన ఆశలు వమ్మయ్యాయి. దాదాపు 180 సీట్లు గెలుస్తామనుకుంటే కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకుని, కనీసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడిని కూడా అధిగమించలేకపోయారు. అయితే, చంద్రబాబును ఓడించిన ఘనతను మాత్రం దక్కించుకున్నారు.

ప్రజారాజ్యం పార్టీకి మూతేసి కాంగ్రెసు పార్టీలో ఆయన కాలు పెట్టారు. కాంగ్రెసు పార్టీ ఆలంబనగా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో చిరంజీవికి కాంగ్రెసులోకి ఎంట్రీ దొరికింది. వచ్చే ఎన్నికల్లో పోరు జగన్‌కూ తనకూ మధ్యే జరుగుతుందని కూడా ఆయన భావిస్తూ ఉండవచ్చు. జగన్‌ను దీటుగా ఎదుర్కోవడానికి తనను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందని ఆయన నమ్ముతున్నారు.

అయితే, కాంగ్రెసులో పరిస్థితులు ఎప్పుడు ఏ మలుపైనా తీసుకోవచ్చు. ఇవాళ జరుగుతుందని అనుకున్నది రేపు జరగకపోవచ్చు. పూర్తి వ్యతిరేకంగా జరగవచ్చు. పైగా, చిరంజీవికి రాష్ట్రంలోని నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావచ్చు. కాంగ్రెసులో అందరూ హీరోలే. ఎప్పుడు ఎవరైనా జీరో కావచ్చు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నారు. పైగా, అధిష్టానానికి ఎల్లవేళలా జీ హుజూర్ అంటూ పని చేయాల్సి ఉంటుంది. దానికి తోడు, పకడ్బందీ వ్యూహం అవసరం. వ్యూహాలను పన్ని, వాటిని అమలు చేసే సత్తా చిరంజీవికి ఉందా అనేది అనుమానమే.

English summary
Chiranjeevi is aspiring for CM post. Will he reaches his goal in Congress party?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X