బాలకృష్ణ: గుడివాడ సేఫ్ సీటు కాదా?

Posted By:
Subscribe to Oneindia Telugu
Balakrishna
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు, హీరో బాలకృష్ణ సురక్షితమైన సీటు కోసం చూస్తున్నారని సమాచారం. తన సొంత జిల్లా కృష్ణాలోనే ఆయన తాను పోటీ చేయడానికి తగిన సీటు కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్లిపోయిన కొడాలి నానికి బుద్ధి చెప్పేందుకు గుడివాడ నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధపడుతున్నప్పటికీ, సురక్షితమైన సీటు చూసుకోవాలని పార్టీ నాయకులు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గుడివాడ నుంచి రెండు సార్లు 1983లోనూ 1985లోనూ విజయం సాధించారు. దాంతో గుడివాడపై ఆయన ప్రత్యేకమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయ ప్రవేశం చేయడానికి గుడివాడ భద్రమైన సీటు కాదని సీనియర్ నాయకులు ఆయనకు చెబుతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితిలో పెనమలూరు నియోజకవర్గంపై బాలకృష్ణ దృష్టి పడినట్లు చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్థసారథి చలసాని పండును కేవలం 177 ఓట్ల తేడాతో ఓడించారు. అయినప్పటికీ పార్టీ నాయకులు బాలకృష్ణ సులభంగా విజయం సాధించే సీటు కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తే సీమాంధ్రలో పార్టీ తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రత్తిపాడులో పార్టీ ఓటమి, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని జంప్ తెలుగుదేశం కార్యకర్తల నైతికస్థయిర్యాన్ని దెబ్బ తీసినట్లు అంచనా వేస్తున్నారు. ఈ స్థితిలో బాలయ్య పోటీ చేస్తే పార్టీకి నైతిక బలం సమకూరుతుందని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Although actor Balakrishna's decision to contest the next election has gladdened his fans and TDP cadres in his home district of Krishna, party leaders have advised Balakrishna to look for a 'safe seat' in the wake of rumours that he may test his luck from Gudivada constituency.
Please Wait while comments are loading...