బొత్సకు చేయి: చిరంజీవితో కిరణ్ రెడ్డి దోస్తీ

Chiranjeevi-Kiran Kumar Reddy
మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందిన మంత్రి సి. రామచంద్రయ్య ప్రకటన వెనక పెద్ద మతలబే ఉందని అంటున్నారు. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసుపై అసంతృప్తిగా కనిపించినప్పటికీ వాటిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీదికి ఎక్కుపెట్టినట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. పాత ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను పార్టీ విస్మరిస్తోందని చెప్పడం ద్వారా బొత్స సత్యనారాయణ సమన్వయానికి ప్రయత్నించడం లేదనే సారం ఉందని చెబుతున్నారు. విలీనం తర్వాత ప్రజారాజ్యం పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణపై ఉంటుంది. అలా చేయడం లేదంటే బొత్స విఫలమైనట్లేనని భావించాల్సి ఉంటుందని అంటున్నారు. అలా అనిపించడానికే సి. రామచంద్రయ్య ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

ఈ పరిస్థితిలో పార్టీ వ్యవహారాలను కూడా చిరంజీవితో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన చేతుల్లోకి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. బొత్సను అప్రధానం చేసి, చిరంజీవిని ప్రధానంగా ముందుకు తేవాలనేది ఆయన ఉద్దేశమని అంటున్నారు. ఇటీవల చిరంజీవి సోనియా గాంధీని కలిశారు. ఈ భేటీలో కూడా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని, ముఖ్యమంత్రితో కలిసి పని చేయాలని, ఉప ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని ఆమె చిరంజీవికి చెప్పినట్లు సమాచారం. అందుకే చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తగిన ప్రణాళికను రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.

చిరంజీవి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో పార్టీ వ్యవహారాలే ప్రధానంగా ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. చిరంజీవికి పార్టీ, ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో చిరంజీవి పాత్ర మరింత పెరిగేలా తగిన వ్యూహాన్ని ముఖ్యమంత్రి రూపొందించినట్లు, దాన్నే ముఖ్యమంత్రి చిరంజీవికి వివరించినట్లు తెలుస్తోంది. ఏమైనా, బొత్సను పోటీ నుంచి తప్పించి ముందుకు రావడానికి చిరంజీవికి ఈ పరిణామం ఉపయోగపడుతుందని అంటున్నారు. కలిసి పనిచేయాలని కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+