చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికె బాబు: వైయస్ జగన్ పార్టీలో వర్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

CK Babu
చిత్తూరు: కాంగ్రెసు చిత్తూరు శానససభ్యుడు సికె బాబు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. ఇటు కాంగ్రెసు పార్టీలోనూ, అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ ఆందోళన పెరుగుతోంది. సికె బాబు, ఆయన భార్య సికె లావణ్య వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ధూమ్‌ధామ్‌గా నిర్వహించి తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

సికె బాబు కుటుంబ సభ్యులు తమ పార్టీలోకి రాకుండా అడ్డుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలపై చర్చించడానికి ఈ నెల 8వ తేదీన కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో సికె బాబు ఏం చేసినా అది ఓ చర్చగా మారడం పరిపాటి. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రస్తుత తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి సికె బాబు వైయస్ జగన్‌ను కలిశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏర్పడిన తర్వాత వైయస్ జగన్ చేపట్టిన ఫీజు పోరు యాత్రకు సికె బాబు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దాంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళ్లిపోతారనే ప్రచారం సాగింది. అయితే, ఆ తర్వాత సికె బాబు నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెలుగుదేశం మాజీ శానససభ్యుడు మనోహర్‌ను సీన్‌లోకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పిస్తామనే హామీతో ఆయనను పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు చేశారు.

ఆ తర్వాత వైయస్ జగన్ ప్రజారాజ్యం మాజీ నాయకుడు జంగాలపల్లి శ్రీనివాస్‌ను, మరో తెలుగుదేశం నాయకుడిని పార్టీలోకి లాక్కోవడానికి వైయస్ జగన్ ప్రయత్నించారు. అయితే దానికి కాంగ్రెసు నాయకుడు ఆదికేశవులు నాయుడు అడ్డు పడినట్లు చెబుతారు. అయితే, మనోహర్ తమకు సరైన అభ్యర్థి కాదని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. తాను పార్టీలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరూ పార్టీలోకి రాలేదని అంటున్నారు.

English summary
The latest political development in Chittoor district following the conduct of YSR’s death anniversary by Chittoor Congress MLA C.K. Babu and his wife C.K. Lavanya, created ripples in the YSR Congress and Congress circles in the district. In a move to prevent the possible entry of the CK family into their party, some YSRC leaders are planning hold a party meeting in Chittoor on September 8 to study the development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X