వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజరుద్దీన్‌కు ఎన్నికల కమిషనర్ నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mohammad Azharuddin
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ మొహ్మద్ అజరుద్దీన్‌కు కయాంగంజ్ ఎన్నికల కమిషనర్ సోమవారం నోటీసులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించడానికి ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఆయన తలమునకలవుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమామళిని ఉల్లంఘించారనే ఆరోపణపై ఆజరుద్దీన్‌కు నోటీసు జారీ అయింది. ఎన్నికల సమావేశంలో ఆయన శాలువాలను పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు.

శంషాబాద్‌లో ఆనయ ఈ నెల 11వ తేదీన శాలువాలు పంపిణీ చేశారు. ఎన్నికల కమిషనర్ అయిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మహేంద్ర కుమార్ మిశ్రా అజరుద్దీన్‌కు నోటీసు జారీ చేశారు. లోకసభ సాధారణ ఎన్నికల్లో హైదరాబాదుకు చెందిన మొహ్మద్ అజరుద్దీన్ మొరదాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతను మీదేసుకోవాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలో అజర్ క్షణం తీరిక లేకుండా పోరాడుతూ వస్తున్నారు. క్రికెట్‌లో డకౌట్ కావడాన్ని తాను అవమానకరంగా భావించేవాడినని, ఎన్నికల్లో కాంగ్రెసు డకౌట్ కావడం కూడా తనకు అంతే అవమానకరంగా భావిస్తానని ఆయన ఇటీవల అంటూ కాంగ్రెసును గెలిపించాలని ఉత్తరప్రదేశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

English summary
A notice has been issued to Congress MP and former cricketer Azharuddin for allegedly violating the model code of conduct by distributing shawls in an election meeting here, officials said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X