వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, కెసిఆర్ ఆ రెండు పార్టీల టార్గెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-YS Jagan
వరుస ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వేడిని అనుభవిస్తున్నారు. ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉవ్విళ్లూరుతుండగా, వారిద్దరి దూకుడుకు కళ్లెం వేయడం ఎలా అనే ఆలోచనలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ పడ్డాయి. కెసిఆర్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేసుకోగా, వైయస్ జగన్‌ను కాంగ్రెసు పార్టీ లక్ష్యం చేసుకుంది. తెలంగాణలో కెసిఆర్‌ను దెబ్బ తీయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. తెరాస విధానాలను కాకుండా, కెసిఆర్ తీరును తప్పు పడుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కెసిఆర్ తెలంగాణ స్థానికుడు కాదని చెప్పడానికి కూడా వారు వెనకాడడం లేదు. కెసిఆర్ విజయనగరం జిల్లాలోని ఓ గ్రామానికి చెందినవాడని నిరూపించడానికి తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. తెరాస శాసనసభ్యుడు, కెసిఆర్ తనయుడు కెటి రామారావు తీవ్రమైన వ్యాఖ్యలతో ముందుకు రావడంతో వారు కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు.

తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం కూడా తెలుగదేశం పార్టీకి పిడుగుపాటుగా పరిణమించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెసిఆర్, జగన్ చేతులు కలిపారని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పు పడుతోంది. కెసిఆర్‌ది దొంగ దీక్ష అని పదే పదే విమర్శలు చేస్తోంది. తెలంగాణలోని ఆరు శాసనసభా స్థానాల్లో కూడా తన సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. అలాగే, సీమాంధ్రలోని కోవూరు సీటును తిరిగి దక్కించుకునే ఆలోచన కూడా చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రసన్న కుమార్ రెడ్డి మళ్లీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయనున్నారు.

మరోవైపు, కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలోని ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదనే జగన్ నిర్ణయాన్ని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు తప్పు పడుతున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి, వీరశివా రెడ్డి జగన్‌పై దుమ్మెత్తిపోశారు. వైయస్సార్ కడుపున చెడబుట్టాడని ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి చెప్పాలని వీరశివా రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కొండా సురేఖను గెలిపించుకోవడానికి మిగతా సీట్లను జగన్ వదిలేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు మాత్రం ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తెలంగాణలో ఎలాగైనా తన సత్తా చాటాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ద్వారా యువతను ఆకట్టుకోవాలని ఆయన చూస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత మూడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెసు పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.

English summary
Congress and TDP have targeted YSR Congress president YS Jagan and TRS president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X