వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌ అరెస్టయితే కోర్ కమిటీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఆస్తుల కేసులో వైయస్ జగన్ అరెస్టయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. జగన్ అరెస్టయ్యే పరిస్థితి లేదని, జగన్ అరెస్టవుతారానే వార్తలు ఊహాగానాలు మాత్రమేనని అంబటి రాంబాబు వంటి నాయకులు అంటున్నారు. కానీ, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు జరిగిన నేపథ్యంలో వైయస్ జగన్ అరెస్టు తప్పదనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా పూర్తిగా దాన్ని తోసిపుచ్చడం లేదు. వైయస్ జగన్ అరెస్టు జరిగితే కూడా పార్టీ దెబ్బ తినకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వైయస్ జగన్ దీనిపై దృష్టి పెట్టారు.

వైయస్ జగన్ అరెస్టు జరిగితే పార్టీ కోర్ కమిటీ పార్టీ వ్యూహాలను ఖరారు చేస్తుంది. పార్టీని ముందుకు నడిపించేందుకు అవసరమైన ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఈ కోర్ కమిటీ ఏర్పాటు కూడా ఇప్పటికే జరిగిపోయినట్లు చెబుతున్నారు. కోర్ కమిటీలో సుబ్బా రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, భూమా నాగి రెడ్డి ఉన్ననట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వహణ బాధ్యతను కోర్ కమిటీ చూసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రయోగాలు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు.

కాగా, ప్రచార బాధ్యత మాత్రం వైయస్ జగన్ తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చూసుకుంటారు. ఆమె విస్తృతంగా ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. ఓదార్పు యాత్రను ఆమె కొనసాగించబోరని అంటున్నారు. జగన్ అరెస్టయితే, దాన్ని ఎదుర్కునేందుకు, దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలోకి విజయమ్మ దిగుతారని అంటున్నారు. పార్టీని నిలబెట్టడం ద్వారా, ఉప ఎన్నికల్లో విజయాలు సాధించడం ద్వారా కాంగ్రెసు పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే జగన్‌ను అరెస్టు చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విస్తృతమైన ప్రచారం చేపట్టే అవకాశాలున్నాయి.

English summary
It is learnt that Core committee has formed to run YSR Congress party in the absence of YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X