అరెస్ట్ ప్రచారం ఎఫెక్ట్: ఎదుర్కొనేందుకు జగన్ సై?

మరోపక్క అరెస్టు వార్తల నేపథ్యంలో.. రాష్ట్రస్థాయిలో పార్టీ వ్యూహాన్ని అమలు చేసే బాధ్యుల సంఖ్యను అమాంతంగా పెంచేశారు. గతంలో 24 మందితో కేంద్ర పాలక మండలిని ఏర్పాటు చేసిన జగన్, ఇప్పుడు దానికి సమాంతరంగా 36 మందితో కేంద్ర కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో ఇటీవల అనర్హత వేటుపడిన 17 మంది ఎమ్మెల్యేలకూ చోటు కల్పించారు. వారితో పాటు మరో పంతొమ్మిది మందికి ఇందులో అవకాశం కల్పించారు. అనర్హత వేటు పడిన మూడో రోజునే ఎమ్మెల్యేలకు పార్టీ పదవులు కట్టబెట్టడం విశేషం. రాష్ట్ర స్థాయిలో పార్టీ బాధ్యతను చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఇది జరిగిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో ఉన్న కేంద్ర పాలక మండలికి సమాంతరంగా ఇప్పుడు కొత్తగా కేంద్ర కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అలాగే గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా పార్టీని నడిపించే విషయమై గతం నుంచే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications