వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌పై కిరణ్ కుమార్ మరో అస్త్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై అనర్హత వేటు వేయించడంలో తీవ్ర జాప్యం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో ఎత్తుగడకు పూనుకున్నారు. ఉప ఎన్నికలను ఒక్కసారి కాకుండా రెండు విడతలుగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ క్యాంపు శానససభ్యులపై అనర్హత వేటు వేయించడంలో ముఖ్యమంత్రి జాప్యం చేశారని అంటారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాలతో పాటు మిగతా 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరగకుండా చూసుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ 17 స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణలో మరింత జాప్యం జరిగేలా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం ఖాళీ అయిన 17 స్థానాలకు రాష్ట్రపతి ఎన్నికల లోపు, అంటే మే, జూన్ నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని తెలియడంతో మరో ఎత్తుగడకు ముఖ్యమంత్రి తెర తీశారని అంటున్నారు. ఖాళీ అయిన 17 స్థానాల వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయడంలో జాప్యం చేస్తున్నారని అంటున్నారు. ఖాళీ అయిన స్థానాల వివరాలను సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. కానీ ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు.

కాంగ్రెసుకు చెందిన 16 మంది శానససభ్యులపై వేటు వేసిన విషయాన్ని, శోభా నాగిరెడ్డి రాజీనామాను ఆమోదించిన విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. ఆ విషయంపై ఆయన ఐదవ తేదీన శాసనసభలో ప్రకటన చేశారు. స్థానాలు ఖాళీ అయిన విషయాన్ని శాసనసభ సచివాలయం వెంటనే ఎన్నికల ప్రధానాధికారికి తెలియజేయాలి. కానీ ఆ పని చేయలేదు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన విషయాన్ని లోకసభ స్పీకర్ మీరా కుమార్ వెంటనే ఆ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలిపారు. కానీ 17 మంది విషయంలో మాత్రం శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పని చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉప ఎన్నికలు మరింత ఆలస్యంగా జరగడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు.

English summary
It is said that in a bid face bypolls after president election, the disqualified MLAs information was not sent to EC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X