వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోళీ సంబరాలకు శ్రీలక్ష్మి దూరం, బ్యారెక్‌లోనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilaxmi
హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో గురువారం జరిగిన హోళీ సంబరాలకు సస్పెండైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి దూరంగా ఉన్నారు. చంచల్‌గుడాలోని మహిళా ప్రత్యేక జైలు ఖైదీలు హోళీ సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో శ్రీలక్ష్మి బ్యారక్‌లో ఒంటరిగా ఉండిపోయారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి అరెస్టయిన విషయం తెలిసిందే. హోళీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కలిసి రావడంతో మహిళా ఖైదీలు తమ విషాదాలను పక్కన పెట్టి ఆనందంగా గడిపారు.

ఓ టెలివిజన్ చానెల్ మహిళా ఖైదీలో కోసం ఓ షోను ఏర్పాటు చేసింది. అయితే, కెమెరా కంటికి చిక్కకుండా శ్రీలక్ష్మి దూరంగా ఉండిపోయారు. జైలులో జరిగే ఉత్సవాల్లో ఖైదీలందరూ పాల్గొనడం తప్పని సరి కాదని, శ్రీలక్ష్మి మాత్రమే కాకుండా చాలా మంది దూరంగా ఉండిపోయారని జైలు అధికారులు అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన అంశాలపై వక్తృత్వ పోటీలను కూడా నిర్వహించారు. వ్యాస రచన పోటీల్లో కూడా వారు పాల్గొన్నారు.

మహిళా ఖైదీల పిల్లలకు పరుగు పందేలు పెట్టగా, మహిళా ఖైదీలకు వాకింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు కూడా ప్రదానం చేశారు. మహిళా ఖైదీలు హోళీ సందర్భంగా ఆడారు, పాడారు. వాటన్నింటికీ శ్రీలక్ష్మి దూరంగానే ఉండిపోయారు.

English summary
Suspended IAS officer Y Srilakshmi, lodged in the jail as an undertrial in the OMC illegal mining case, however, chose not to venture out of her barrack on the occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X