తెలంగాణ: కొత్త స్టోరీ చెబుతున్న కెసిఆర్

పిడికెడు మంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని, అసైన్డ్, అక్రమ భూములను కలిగి ఉన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాదును సమస్యగా చూపడం పెట్టుబడులు పెట్టడం వల్ల కాదని, అక్రమాస్తుల వల్లనే అని ఆయన అన్నారు. చట్టబద్దమై ఆస్తుల విషయంలో సమస్య ఉండదని, అక్రమాస్తులను కలిగి ఉన్నందునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్య వస్తుందని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.
హైదరాబాదు లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము అంగీకరించబోమని కెసిఆర్ అన్నారు. హైదరాబాదు రాజధానిగా తమకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తప్పదని ఆయన అన్నారు. రాయల తెలంగాణవంటి పిచ్చి ప్రతిపాదనలతో తెలంగాణ ప్రజలు అయోమయానికి గురి కావద్దని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్పదని ఆయన అన్నారు.
కాగా, హైదరాబాదు చట్టుపక్కల ఉన్న అక్రమాస్తుల కారణంగానే సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారనే కెసిఆర్ మాటలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాదులోని, హైదరాబాదు పరిసరాల్లోని భూములకు విపరీతంగా గిరాకీ ఉంటూ వస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారాలు కూడా భారీగానే జరిగాయి. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఉదంతం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications