వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను అరెస్టు చేస్తారా!?, పార్టీలో ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆస్తుల కేసులో ఈ నెల 28వ తేదిన కోర్టుకు హాజరు కావాలని సిబిఐ ప్రత్యేక కోర్టు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సమన్లు పంపిన విషయం తెలిసిందే. జగన్‌తో పాటు ఆస్తుల కేసులో ఎ-2గా ఉన్న విజయ సాయి రెడ్డి తదితరులకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

ఈ నెల 25న. కాగా 28న కోర్టుకు జగన్ హాజరైన పక్షంలో సిబిఐ అరెస్టు చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆస్తుల విషయంలో జగన్‌ను కోర్టు ప్రశ్నించిన అనంతరం జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బెయిల్ దొరికితే ఒకే. లేకుంటే అప్పటికప్పుడు సిబిఐ జగన్‌ను అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

గతంలో తమిళనాడు ఎంపి కనిమొళి విషయంలో ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నికల దృష్ట్యా జగన్‌ను అరెస్టు చేయకపోవచ్చుననే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఉప ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేస్తే మరింత సానుభూతి ఏర్పడి ఆయన అభ్యర్థుల గెలుపు సునాయాసమవుతుందని ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు. ఉప ఎన్నికల దృష్ట్యా అయిన జగన్‌ను ఇప్పటికిప్పుడు అరెస్టు చేయకపోవచ్చునని అంటున్నారు.

అవసరమైతే ఉప ఎన్నికల అనంతరం ఏమైనా చర్యలు తీసుకోవచ్చునని చెబుతున్నారు. ఆస్తుల కేసులో కేవలం జగన్‌ను కోర్టు ప్రశ్నించి మాత్రమే విడిచి పెడుతుందని అంటున్నారు. అయితే జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ప్రా స్ట్రక్చర్‌ల బ్యాంక్ ఖాతాలను సిబిఐ ఇప్పటికే స్తంభింపజేసింది. దీంతో ఆయన ఆస్తులను మాత్రం ప్రభుత్వం ఏ క్షణంలోనైనా జప్తు చేయవచ్చుననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

మరోవైపు ఉప ఎన్నికలలో భవితవ్యంపై వైయస్సార్ కాంగ్రెసు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆస్తుల కేసులో జగన్‌కు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేయడం, బ్యాంకుల ఖాతాలను స్తంభింప చేయడం తదితర అంశాలు ఆ పార్టీలో చర్చకు దారి తీసినట్లుగా కనిపిస్తోంది. 28న జగన్ కోర్టు విచారణకు హాజరైతే ఆ తర్వాత పరిస్థితి ఏమిటనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కోర్టుకు హాజరు కావడం పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చునని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా జగన్ తాను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా అనుమతి తీసుకునే అవకాశాలు ఉన్నదని అంటున్నారు. తాను కోర్టుకు హాజరు కాలేనని, తన తరఫున తన న్యాయవాది హాజరవుతారని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

English summary
It is said that, the talking going in political parties will YSR Congress Party chief YS Jaganmohan Reddy arrested by CBI or not. CBI special court already sent summons to YS Jaganmohan Reddy and Vijaya Sai Reddy to attend before court on 28th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X