జగన్‌తో రాజీకి జాతీయ నేతల మధ్యవర్తిత్వం?

వారితో వైయస్ జగన్ విషయాన్ని ఆయన ప్రస్తావించారని అంటున్నారు. వైయస్ జగన్‌ను కాంగ్రెసుకు అనుకూలంగా తిప్పుకోవాలని కొందరు జాతీయ స్థాయి నాయకుల ద్వారా కాంగ్రెసు నాయకులే మధ్యవర్తిత్వం జరుపుతున్నారని రాహుల్ గాంధీ వారికి చెప్పినట్లు సమాచారం. జగన్ విషయంలో చట్టప్రకారం జరుగుతున్నది జరగనివ్వండని, తాము జోక్యం చేసుకోవద్దని, ఇతర వర్గాల్లో కాంగ్రెసు బలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలో చెప్పండని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి.
సమావేశంలో ఛత్తీస్‌గడ్ నేత, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి పాల్గొన్నట్లు చెబుతున్నారు. రాజకీయంగా, పాలనాపరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంటామనే విషయంపై సమావేశంలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
తెలంగాణ మార్చ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్రలపై రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. చంద్రబాబు యాత్రకు ప్రజా స్పందన దండిగా వస్తున్నట్లు తనకు సమాచారం ఉందని రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. తమ పార్టీ ప్రజల మధ్యకు ఎందుకు వెళ్లలేకపోతోందని ఆయన అడిగారని చెబుతున్నారు.
తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, జగన్ విషయంలో వివిధ వర్గాలు చీలిపోవడం వల్ల పార్టీ క్యాడర్ అయోమయంలో పడిందని, ఈ రెండు విషయాలపై నిర్దిష్టమైన సూచనలు వస్తే ముందుకు వెళ్లడానికి వీలుంటుందని పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో చెప్పినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో ప్రమేయం లేకుండా స్వతంత్ర నిర్ణయంతో ప్రజల ముందుకు వెళ్లాలని ఓ నాయకుడు రాహుల్‌తో అన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications