వైయస్ జగన్ 'జగతి'కి మూలం లక్షేనట

తర్వాతి సంవత్సరం అంటే 2007 జూన్ 21న జరిగిన బోర్డు మీటింగ్‌లో వైయస్ జగన్, వై ఈశ్వరప్రసాదరెడ్డి డైరెక్టర్లుగా నియమితులయ్యారని, అదే సమయంలో విజయసాయిరెడ్డి డైరెక్టరు పదవికి రాజీనామా చేశారని, దానిని బోర్డు ఆమోదించిందని కార్తిక్ చెప్పాడు. 2007 మార్చి 31న రూ. 10 ముఖ విలువ కలిగిన ఐదుకోట్ల 35వేల 8వందల షేర్లను, అదే సంవత్సరం ఆగస్టు 2న రూ. 10 ముఖ విలువ కలిగిన రెండుకోట్ల 35 లక్షల 25 వేల షేర్లను జగతి బోర్డు కార్మెల్ ఏషియా సంస్థకు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకుందని వివరించాడు. 2009 జనవరి 12న జగతి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిందని కార్తీక్ వాంగ్మూలంలో వెల్లడించాడు.
జగతిలోకి తొలుత ఏయే కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చాయో కార్తీక్ వెల్లడించినట్లు మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. "గిల్‌క్రిస్ట్, ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా అవెన్యూస్, బీటా అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రూ.10 విలువ గల ఒక్కో షేరును రూ.350 ప్రీమియంతో కలిపి రూ.360కు కొనుగోలు చేశాయి. మొత్తంగా రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టాయి'' అని కార్తీక్ తెలిపినట్లు వివరించాయి. ఆయా కంపెనీలు ఎన్ని షేర్లు కొని, ఎంతెంత పెట్టుబడి పెట్టాయో వివరించారు. గిల్‌క్రిస్ట్ సంస్థ మినహా మిగతా మూడు కంపెనీల తరఫున నిమ్మగడ్డ ప్రకాష్ సంతకాలు చేసినట్లు చెప్పారు. జగతి కంపెనీలోకి తన చేరిక ఎలా జరిగిందో కూడా వివరించారు.
జగతి పబ్లికేషన్‌కు కంపెనీ సెక్రటరీగా 2009 ఆగ స్టు 17న చేరానని, అంతకు ముందు ఎన్.రాజ్యలక్ష్మి ఆ పోస్టులో ఉన్నారని, కంపెనీ సెక్రెటరీ విధులతో పాటు కంపెనీ బోర్డు మీటింగులు, సాధారణ, కమిటీ సమావేశాలు నిర్వహించడం కూడా చేస్తుండే వాడినని కార్తిక్ చెప్పాడు. షేర్ హోల్డర్ల వివరాలు, వారి దరఖాస్తులకు సంబ ంధించిన వ్యవహారాలను పర్యవేక్షించానని, రూ.450 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఆ నాలుగు కంపెనీలు ఆమోద ముద్ర వేశాయని కార్తీక్ చెప్పారు.












Click it and Unblock the Notifications