వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలులో వైయస్ జగన్: పార్టీలో ముఠా తగాదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలులో ఉండడం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో పార్టీని నడించలేమనే ఆవేదన, ఆందోళన పార్టీలో పెరుగుతోందని అంటున్నారు. రాజకీయానుభవం లేకపోవడంతో పార్టీని ఏకతాటిపై నడపడం ఆమెకు సాధ్యం కావడం లేదని అంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి ఆరుగురు చొప్పున అసెంబ్లీ అభ్యర్థులు, ముగ్గురేసి ఎంపీ అభ్యర్థులు ఇప్పటినుంచే పోటీ పడుతుండటంతో ముఠాలు పెరిగి, అది వారి మధ్య ఘర్షణలకు దారితీ స్తోందని వార్తలు వస్తున్నాయి.

మీడియా కథనాల ప్రకారం - ఇప్పటిదాకా పార్టీ నిర్మాణం లేకపోవడంతో ఎవరికివారే నాయకులుగా చలామణి అవుతున్నారు. ఇది ముఠా తగాదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. పార్టీకి అస్త్రం లాంటి అంబటి రాంబాబు వంటి సీనియర్‌ నాయకులే అభద్ర తాభావంతో ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఎంత దారుణంగా తయా రవుతోందో అర్థం చేసుకోవచ్చని పార్టీ సీనియర్లే చెబుతున్నారు. రాంబాబు వంటి నేతలకు నియోజకవర్గ ఎంపికలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సింది పోయి, వారిమీద కూడా మరొకరిని పోటీకి తయారు చేసి, విభజించి పాలించే సూత్రం కింది స్థాయిలో తిరగబడుతోంది. ఒకరిమీద మరొకరిని పోటీ పెడితే అది పార్టీ అయినా, సంస్థ అయినా కుప్పకూలుతుందని అంటున్నారు.

రాయలసీమలో కడప మినహా మిగిలిన జిల్లాలతో పాటు, కోస్తా జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లో ముఠా తగాదాలు ముదురుతున్నాయని అంటున్నారు కర్నూలు జిల్లాలో వైఎస్‌ కుటుంబ పెత్తనం పెరిగిందని, విజయమ్మ సోదరుడు మాజీ మేయర్‌ రవీంద్రనాధ్‌రెడ్డి జిల్లాలో సొంత వర్గం తయారు చేసుకునే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఇటీవలి కాలంలో తమ బంధువులతో వచ్చిన విబేధాల దృష్ట్యా నంద్యాల అసెంబ్లీకి కొత్త అభ్యర్ధిని తయారు చేసుకునేందుకు రవీంద్రనాధ్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు. నేషనల్‌ కాలేజీ అధిపతి ఇంతియాజ్‌ అహ్మద్‌ను వైవి, రవీంద్రనాధ్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారు.

నంద్యాల పార్లమెంటు పరిథిలో ఇప్పటికే ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి కాంగ్రెస్‌ నుంచి రావడం ఖాయమయింది. రానున్న ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్ధిగా పోటీచే యబోతున్నారు. ఆ మేరకు ఆయనతో మాట్లాడిన వైవి, రవీంద్రనాధ్‌రెడ్డి... నంద్యాల పార్లమెంటు పరిథిలో తమకు ఇతరుల సాయం, బలం అవసరం లేదని సొంత పార్టీ వర్గానికి సంకేతాలిస్తున్నారు. ఇటీవల వైవి సుబ్బారెడ్డి నంద్యాలకు వచ్చినప్పుడు జరిపిన ర్యాలీకి భూమా వర్గం దూరంగా ఉండటం, శోభా నాగిరెడ్డి కాలేజీ నుంచి బదులు, వైయస్ విగ్రహం నుంచి మందీ మార్బలంతో కాకుండా సాదాసీదాగా హాజరుకావడం చర్చనీయాంశమవు తోంది. కడప జిల్లా రాయచోటిలో రవీంద్రనాధ్‌రెడ్డి పెత్తనాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సహించలేకపోతున్నారని అంటున్నారు పార్టీలో మైసురారెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారని, కుటుంబపార్టీగా తయారవుతోంద్నన విమర్శలు పెరుగుతున్నాయి.

ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా ఉన్న చందా లింగయ్య స్థానంలో పువ్వాడ ను నియమించారు. వైవి సుబ్బారెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డితో పాటు వైఎస్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉండే మరికొందరు ఇప్పటినుంచే రానున్న ఎన్నికల్లో టికెట్లపై హామీలిస్తున్నారని, ఇది స్థానికంగా పార్టీలో ముఠాలను పెంచుతోందని అంటున్నారు. ఇటీవల చేసిన బంద్‌ రోజున కూడా నాయకులు ఎవరికి వారు నియోజకవర్గాల్లో మూడు దారుల్లో ఆందోళనలు నిర్వహించడం, మిగతా సమయాల్లో సైతం ఎవరికి వారు ధర్నాలు చేస్తూ సొంత ఇమేజ్‌ పెంచుకునే పనిలో ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను వీడి జగన్‌ వెంట వచ్చిన అంబటి రాంబాబు, జూపూడి ప్రభాకర్‌ వంటి సీనియర్లు సైతం ఉనికి కోసం పోరాడుతున్న దుస్థితి నెలకొంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బీసీ నేతల మధ్య యుద్ధం జరుగుతోంది. కోస్తాలో రెడ్డి-బీసీ-మైనారిటీల మధ్య పోరు జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ముఠాల ముసలం కొనసాగుతోంది. జక్కంపూడి విజయలక్ష్మి- ఫ్లోర్‌లీడర్‌ సీహెచ్‌ రాఘవబాబు మధ్య యుద్ధం జరుగుతోంది.తెలుగుదేశం నుంచి వెళ్లిన ఆదిరెడ్డి అప్పారావు-బొమ్మన రాజ్‌కుమార్‌ మధ్య ఘర్షణ నెలకొంది. ఇద్దరూ రాజమండ్రి సీటు కోసం పెనుగులాడుతున్నారు. ఈ తలనొప్పి భరించలేక ఆదిరెడ్డి అమెరికా వెళ్లారు. అమలాపురంలో జిల్లా కన్వీనర్‌ చిట్టబ్బాయి-పికెరావు మధ్య అధిపత్యపోరు కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో సీనియర్‌ నేత అంబటి రాంబాబు చాలా కాలం నుంచి కాపుల బలం ఎక్కువగా ఉన్న సత్తెన పల్లిపై దృష్టి సారించారు. ఆయన ఆ నియోజక వర్గంలోనే ఎక్కువ ఉంటున్నారు. అయితే, ఆయనకు విజయభాస్కరరెడ్డితో పొసగడం లేదు.

కృష్ణా జిల్లాలో కూడా ముఠా తగాదాలు పెరుగుతున్నాయని అంటున్నారు. పెనమ లూరు నియోజకవర్గంలో పద్మావతి, పడమట సురేష్‌బాబు వర్గాల మధ్య యుద్ధం జరుగు తోంది. విజయవాడ సిటీలో వంగవీటి రాధా- జలీల్‌ఖాన్‌ మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్‌ కూడా పార్టీలో చేరడంతో రెండు సామాజిక వర్గాల మధ్య పోరు జరుగుతోంది. జిల్లా కన్వీనర్‌ సామినేని ఉదయభాను, సిటీ కన్వీనర్‌ గౌతంరెడ్డి మధ్య ఘర్షణ జరుగుతోంది. నందిగామలో ప్రసాదరావు-వాసిరెడ్డి పద్మ భర్త వెస్లీ మధ్య అధిపత్యపోరు జరుగుతోంది.

విజయనగరం జిల్లాలో యువజన విభాగం కన్వీనర్‌ ఏ.విజయ్‌-గురానా అయిలు; బొబ్బిలిలో పెద్దింటి రామ్మోహన్‌రావు-సీహెచ్‌ రమేష్‌; ఎస్‌.కోటలో ఎన్‌ఆర్‌ఐ బి.శ్రీనివాస్‌- రహ్మాన్‌ వర్గాల మధ్య అధిపత్యపోరు కొనసా గుతోంది. బొబ్బిలిలో సీనియర్‌ నేత పెన్మత్స సాంబశివరాజును ఇటీవల శివున్నాయుడు అనే సీనియర్‌ కార్యకర్త జిల్లాలో పార్టీ వల్లే భ్రష్ఠు పట్టిందంటూ చొక్కాపట్టుకుని నిలదీసేంతగా ఘర్షణ పడగా, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయవలసి వచ్చింది. ఈ జిల్లాలో ఇప్పటికి ముగ్గురు పరిశీలకులు మారడం బట్టి, విజయనగరంలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయికి చేరాయో స్పష్టమవుతోంది.

అనంతపురం జిల్లాలో కూడా ముఠా తగాదాలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి. హిందూపురంలో సీహెచ్‌ రామకృష్ణారెడ్డి- కె.వేణుగోపాల్‌రెడ్డి; పుట్టపర్తిలో కడపల మోహన్‌రెడ్డి-సోమగోపాల్‌రెడ్డి; కదిరిలో జొన్నా సూర్యనారాయణ కుటుంబం-మాజీ మంత్రి షాకీర్‌; ధర్మవరంలో జిల్లా కన్వీనర్‌ శంకర నారాయణ-చంద్రశేఖరరెడ్డి; కళ్యాదుర్గంలో వైఎస్‌ జగన్‌ అభిమానసంఘం అధ్యక్షుడు ఎల్‌.మోహన్‌రెడ్డి-లారీ మచ్చన్న మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది.

ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ జూపూడి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి; ముక్కుకాశిరెడ్డి-రమణారెడ్డి మధ్య ఘర్షణ జరుగు తోంది. ఈ జిల్లాలో బాలినేని, వైవి సుబ్బారెడ్డి పెత్తనాన్ని నేతలు, సీనియర్లు భరించలేక పోతున్నారు. వారిని కాదని ఏమీ చేయ లేకపోతున్నారు. వైఎస్‌ కుటుంబసభ్యులు, సమీప బంధువు లంతా పార్టీపై పెత్తనం చేస్తుండ టం పార్టీ నేతలను ఆందోళన కలిగిస్తోంది.

కాంగ్రెస్‌లో విలీనంపై ఇటీవల విజయమ్మ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలీనంపై ఇప్పుడే చెప్పలేమని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేనని చేసిన వ్యాఖ్యలు తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నారు. మీడియా, ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను తిప్పికొట్టలేక పోతున్నామన్నారు.

వైయస్ జగన్‌పై మరికొన్ని చార్జిషీట్లు నమోదయ్యే అవకాశం ఉన్నందున, బెయిల్‌ ఎప్పుడు వస్తుందో అర్ధం కావడం లేదంటున్నారు. జగన్‌ ఎప్పుడు బయటకు వస్తారో తెలియడం లేదని, ఆయన బయటకు రానంత వరకూ పార్టీ ఇలాగే గాల్లో ఉండక తప్పదని స్పష్టం చేస్తున్నారు. జగన్‌ జైలు నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యక్రమాలు, యంత్రాంగం సక్రమంగా లేకపోతే వృధానే అంటున్నారు.

English summary
According to media reports - bicjerings in YS Jagan's YSR Congress party are increasing. Groups in every districts are fighting each other to take advantage. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X