ఎమ్మార్‌లోనూ జగన్ ఇరుక్కుంటారా?

ఆ విషయాన్ని అలా వుంచితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సిబిఐ దర్యాప్తు తీరుపై అగ్గి మీద గుగ్గిలం కావడానికి సరైన కారణమే ఉందని అంటున్నారు. ఓ వైపు వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. అయితే, ఈలోగా ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న సునీల్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. ఇక్కడి నుంచే ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు మలుపు తిరిగిన విషయం అర్థమైంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు కూడా వైయస్ జగన్‌కు చుట్టుకునే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సిబిఐని శాపనార్థాలు పెడుతున్నారని అంటున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఎమ్మార్ కుంభకోణం చోటు చేసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో 2009లో మరణించారు. ఎమ్మార్ వ్యవహారంలో లాభపడిన సంస్థలు కూడా వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికను నడుపుతున్న జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ స్థితిలో సిబిఐ దర్యాప్తును రాజకీయ కక్షగా జగన్ ఆరోపిస్తున్నారని అంటున్నారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో వైయస్సార్ ప్రియమిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు బావమరి పి. పార్థసారథిని కూడా సిబిఐ చేర్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్థసారథి జూన్ 2008గ నుంచి 2010 మధ్య కాలంలో ఎపిఐఐసి డైరెక్టర్‌గా ఉన్నారు. ఎమ్మార్‌లో కెవిపి భార్యకు ఓ విల్లా ఉంది. ఏమైనా, వైయస్ జగన్ ఎమ్మార్ కేసులోనూ చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications