వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు కేసుల్లోనూ వైయస్ ఫ్యామిలీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
సిబిఐ విచారిస్తున్న మూడు ప్రధాన కేసుల్లోనూ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులే ప్రధాన పాత్ర పోషించారనే వార్తలు వస్తున్నాయి. ఈ మూడు వ్యవహారాల్లోనూ వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే ప్రయోజనం పొందిందంటూ రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్సార్ తనయుడు వైయస్ జగన్ ఆంతరంగికుడు సునీల్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఈనాడు ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ ప్రాపర్టీస్, వైయస్ జగన్ అస్తుల వ్యవహారాల్లో లబ్ధిదారులు వైయస్ కుటుంబ సభ్యులేనట.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) నుంచి అక్రమ మైనింగ్ సంపాదన వైయస్ జగన్‌కు చెందిన సాక్షిలోకి ప్రవహించిందని ఈనాడు ఆరోపించింది. అలాగే, తాజాగా ఎమ్మార్ కుంభకోణంలోనూ వైయస్ కుటుంబ సభ్యులు సొమ్ము కాజేసినట్లు బయటపడిందని తెలిపింది. అధిక ధరలకు విల్లాలు విక్రయించిన సొమ్ములో 70 కోట్ల రూపాయలు వైయస్ జగన్ ఖాతాలోకి చేరాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని జగన్ సంస్థల్లోకి మళ్లించడంలో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించడానేది ప్రధాన ఆరోపణ. ఎమ్మార్ విల్లా స్థలాల విక్రయం వల్ల సమకూరిన సొమ్ములో రూ. 70 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అందించానని, ఆ నిధులను సునీల్ రెడ్డి ద్వారా వారికి చేర్చానని కేసులో ఇప్పటికే అరెస్టయిన కోనేరు ప్రసాద్ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ముడుపులు చెల్లించనవారికి మధ్య సునీల్ రెడ్డి సంధానకర్తగా వ్యవహరించినట్లు సమాచారమంటూ ఈనాడు దినపత్రిక రాసింది. అక్రమార్జనకు సంబంధించిన సొమ్మును జగన్ వరకు చేర్చే బాధ్యత సునీల్ రెడ్డిది కాగా, ఆ సొమ్మును వివిధ కంపెనీల ద్వారా వినియోగంలోకి తేవడం విజయ సాయి రెడ్డి పని అని చెబుతారంటూ వ్యాఖ్యానించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో విచారణ వేగం పెరిగిన తర్వాత సునీల్ రెడ్డి కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లాడని చెబుతారు.

English summary
According to a news report - in three major scams, probing CBI, YSR family is benifitted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X