వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదే కానీ: అఫ్జల్ ఎరక్కపోయి ఇరుక్కున్నారా!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Afzal Guru
పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురును శనివారం తీహారు జైలులో దాడి తీయడాన్ని ఎక్కువమంది సమర్థించినప్పటికీ పలువురు ఖండిస్తున్నారు. పార్లమెంటుపై ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామని చెబుతూనే..అఫ్జల్ గురును దోషి అంటే ఒప్పుకోవడం లేదు పలువురు. పలువురు మానవ హక్కుల నేతలు, సంఘాల ప్రతినిధులు అఫ్జల్ ఉరిని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు కూడా. దీంతో అసలు అఫ్జల్ గురు దోషా? కాదా? అనే చర్చ జరుగుతోంది. అఫ్జల్ దోషేనని కానీ, ఆ తర్వాత మారిపోయాడని చెబుతున్నారు.

మారిపోయిన వ్యక్తిని ఉరితీస్తే ఉగ్రవాదాలు లొంగిపోయేందుకు ముందుకు రారని అంటున్నారు. అఫ్జల్ దారితప్పిన మాట నిజమేనని, ఉగ్రవాద శిక్షణకు వెళ్లిన విషయమూ వాస్తవమేనని, ఆ తర్వాత మాత్రం అతడు మారిపోయి, భద్రతాదళాలకు లొంగిపోయాడంటున్నారు. లొంగుబాటుకు - పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా మారడానికి మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆయన న్యాయవాదులు, హక్కుల సఘాల నేతల వాదనలు అఫ్జల్ దారి తప్పినప్పటికీ ఆ తర్వాత మారిపోయినట్లుగా ఉన్నవి.

సాధారణంగా లొంగిపోయిన ఉగ్రవాదులపై భద్రతాదళాలు, ఎస్టీఎఫ్ నిఘా ఉంటుంది. వారు ఇన్‌ఫార్మర్లుగా పని చేయాల్సి ఉంటుంది. అఫ్జల్ గురు సోపోర్‌లో వైద్య పరికరాల కమిషన్ ఏజెన్సీని నిర్వహించుకుంటుండగా... ఎస్టీఎఫ్ సిబ్బంది అతడిని తీసుకెళ్లారు. అక్కడి డిఎస్పీ రూ.లక్ష లంచం అడిగాడు. అఫ్జల్ భార్య నగలు అమ్మి రూ.80 వేలు చెల్లించాడు. అఫ్జల్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి క్లాసులు తీసుకునేవాడు. హోం ట్యూషన్ పేరుతో పరిచయమైన అల్తాఫ్ హుసేన్ ఒక రోజున అతడిని ఓ డిఎస్పీ వద్దకు తీసుకెళ్లాడు. నాకో పని చేసి పెట్టాలని మహమ్మద్ అనే వ్యక్తిని ఢిల్లీలో దించి రావాలని అఫ్జల్ గురుకు చెప్పాడు.

మహమ్మద్ ప్రాధేయపడటంతో అతనితోపాటు కొన్నాళ్లు ఢిల్లీలోనే అఫ్జల్ ఉన్నాడు. ఒక రోజున మహమ్మద్ కారు కొనాలనడంతో కరోల్‌బాగ్‌కు తీసుకెళ్లి ఓ కారు కొనిపించాడు. నువ్వు చేసిన సహాయానికి ఇది బహుమతి అంటూ మహమ్మద్ రూ.35 వేలు ఇచ్చాడు. అఫ్జల్ శ్రీనగర్ వచ్చి సోపోర్‌కు వెళ్లడానికి బస్టాండ్‌లో నిరీక్షిస్తుండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. ఆ తర్వాతే... మహమ్మద్ ఉగ్రవాది అని, పార్లమెంట్‌పై దాడికి పథకం వేశాడని తెలిసిందట. తనను ఈ కేసులో ఇరికించారని అఫ్జల్ గురుకు ఆ తర్వాత అర్థమైందట. సాధారణ జీవితం గడుపుదామనుకున్న తనపై మళ్లీ ఉగ్రవాద ముద్ర వేశారని తన న్యాయవాదులకు రాసిన లేఖల్లో అఫ్జల్ పేర్కొన్నాడట.

English summary
Supreme Court advocate Kamini Jaiswal on Saturday said the UPA government's decision to hang Md Afzal Guru was driven by political consideration and that his rights were violated as his family was not informed. Activists demanded Afzal's body be handed to his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X