వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణించు సోనియమ్మా: సిఎంపై చిరంజీవి ఢీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: దారితెన్నూ లేక రాష్ట్ర కాంగ్రెసు నాయకులు విలవిలలాడుతున్నారు. పార్టీ రాష్ట్రంలో ఎలా గట్టెక్కుతుందో, ఎలా చక్కబడుతుందో తెలియని స్థితి ఉంది. ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెసు అధిష్టానం విఫలం అవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకు ఏదో మార్గం చూపాలని వారు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరుతున్నారు. అదో జరుగుతుందని భావిస్తే మరేదో జరుగుతోంది. మంత్రి వర్గం నుంచి డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్‌ను ఎవరూ ఊహించలేదు. పిడుగుపాటులా అది వచ్చి మీద పడింది. మరింత మంది మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం కూడా ప్రారంభమైంది.

తాము కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి సోనియాతో అన్నట్లు సమాచారం. వీరు బుధవారం ఢిల్లీలో వేరు వేరుగా సోనియాను కలిశారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడమే పార్టీకి పెద్ద సమస్య అని సోనియాకు చిరంజీవి వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరిని ఆయన తప్పు పట్టినట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో ఢీకొట్టడానికి చిరంజీవి సిద్ధమైనట్లు చెబుతున్నారు.

తన వర్గానికి చెందిన మంత్రి సి. రామచంద్రయ్యకు మద్దతుగా చిరంజీవి సోనియా వద్ద వాదించినట్లు తెులస్తోంది. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, పార్టీని బలోపేతం చేయాలన్న యోచనలోనే అలా మాట్లాడారని చిరంజీవి వివరించినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ ఢిల్లీ పర్యటనలో సోనియా, రాహుల్ ఇద్దరినీ కలిశారు. రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై సమగ్ర నివేదికను సమర్పించారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర పరిస్థితిపై దృష్టి కేంద్రీకరిస్తామని, అంతవరకూ మరే చర్యలు ఉండవని అధిష్ఠానం రాష్ట్ర నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పట్టుబట్టినందువల్లనే డిఎల్ రవీంద్రారెడ్డిపై చర్యకు అంగీకరించామని, అంత మాత్రాన తాము ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు కాదని ఢిల్లీ పెద్దలు తమను కలిసిన నేతలకు చెబుతున్నట్లు తెలిసింది.

తెలంగాణపై అధిష్ఠానం సీరియస్‌గా ఆలోచిస్తోందని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం ప్రకటించే వీలుందని ఢిల్లీలో మకాం వేసిన ఒక ముఖ్యనేత వివరించారు. ఈ విషయంలో కిరణ్ తన వైఖరిని స్పష్టం చేశారని అంటున్నారు. ఛత్తీస్‌గఢ్ దాడిని ఉటంకిస్తూ మావోయిస్టులు పెరిగిపోయే అవకాశం ఉందని కిరణ్ వివరించినట్లుగా చెబుతున్నారు. కాగా, బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం రాజనరసింహ కూడా ఢిల్లీ వచ్చారు. ఆయనతో అధిష్టానం పెద్దలు ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

English summary

 While chief minister N Kiran Kumar Reddy had a long meeting with AICC general secretary and in-charge of Andhra Pradesh GhulamNabi Azad in the post-DL Ravindra Reddy sacking scenario, Union tourism minister K Chiranjeevi discussed state politics with party president Sonia Gandhi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X