అక్బర్‌కు అసద్ వత్తాసు: మజ్లిస్ తగ్గకుండానే..?

ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరులో మజ్లిస్ పార్టీ సభ చర్చనీయాంశమైంది. ఆ సభలో మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడతారు, సభకు అనుమతి వస్తుందా అనే ప్రశ్నలు ఉదయించాయి. అయితే డిజిపి మాత్రం మజ్లిస్ సభకు అనుమతించారు. ఆ సభలో అసద్ తమ కోపం హిందువుల పైన కాదని కేవలం బిజెపి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనే అని వివరించారు.
అయితే అసద్ వివరణలో స్పష్టత లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మజ్లిస్ పార్టీకి బిజెపి, కిరణ్ పైన వ్యతిరేకత ఉంటే.. ఆ పార్టీ పైన, కిరణ్ పైన ఎలాంటి విమర్శలైనా చేసుకోవచ్చు. కానీ హిందువుల పైన, హిందూ దేవతల పైన వివాదాస్పద కామెంట్లు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు క్షమాపణలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కోర్టు తీర్పును, చట్టాన్ని గౌరవిస్తామని, తప్పులేదని నిరూపించుకుంటామని అసద్ చెప్పారే కానీ తాము తప్పుడు వ్యాఖ్యలు చేశామని మాత్రం అంగీకరించడం లేదంటున్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన అక్బర్‌ను అసద్ సమర్థిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాండూరు సభలో అసద్ హిందువులకు వ్యతిరేకం కాదని చెప్పడం కేవలం మభ్యపెట్టడానికే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మజ్లిస్ రాష్ట్రవ్యాప్త పార్టీగా ఎదగాలనుకుంటుంది. అందుకు హిందూ ఓట్లు కూడా అవసరం! ఈ నేపథ్యంలో అక్బర్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కేవలం తూతూమంత్రంగా తాము వ్యతిరేకం కాదనే ప్రకటన చేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
పాతబస్తీ చుట్టు పక్కల ప్రాంతాల్లో గెలిచేందుకు కూడా మజ్లిస్ పార్టీకి హిందూ ఓట్లు చాలా కీలకం. కార్వాన్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో హిందూ ఓట్లు చాలా ఉన్నాయి. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా హిందువును నిలబెట్టారు. కార్పోరేషన్ ఎన్నికల్లోనూ మజ్లిస్ హిందువులను నిలబెడుతోంది. పాతబస్తీకి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఆధిపత్యం చలాయించాలనే భావనలో ఆ పార్టీ ఉంది.












Click it and Unblock the Notifications