చంద్రబాబు యాత్ర: అడుగు తీసి అడిగేస్తే వంద

ప్రతిరోజూ సగటున 12 నుంచి 15కిలోమీటర్ల మేర చంద్రబాబు యాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర మధ్యలో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి సకల సౌకర్యాలతో కూడిన ఓ అధునాతన బస్సు, రాత్రిపూట బసచేయడానికి మరో విలాసవంతమైన బస్సు ఆయన వెంట ఉంటాయి. సుమారు 10 మందితో కిచెన్‌స్ట్ఫాతో రెండు వ్యాన్లు ఆయనను అనుసరిస్తున్నాయి.
పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబు భద్రత కోసం కేంద్రం బ్లాక్‌క్యాట్ కమాండోలతో జడ్‌ప్లస్ భద్రత కల్పించగా, రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. మొత్తం మూడు షిఫ్ట్‌ల్లో ఆయనకు 200 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. వీరుగాక సుమారు 300 మందికిపైగా ప్రైవేటు సైన్యం చంద్రబాబును అనుసరిస్తోంది. ఆయన రాత్రిపూట బస చేసే చోటే ప్రతిరోజూ అందరికీ టిఫిన్, భోజనానికి ప్రత్యేకమైన వంట ఏర్పాట్లు చేస్తున్నారు.
పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ప్రసంగాన్ని ప్రజలకు విన్పించేందుకు ప్రత్యేక వాహనంలో డాల్బిసౌండ్ మైక్‌సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. మొత్తంగా బాబు ప్రతిరోజూ సుమారు 12నుంచి 15కిలోమీటర్లు నడుస్తుండగా, కిలోమీటరుకు లక్షరూపాయల చొప్పున ఖర్చవుతోందని తెలుగుదేశం నాయకుడే చెప్పినట్లు ఓ పత్రిక రాసింది. ఈ ఖర్చంతంటినీ పాదయాత్ర దారిలో ఏ నియోజకవర్గం వస్తే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లాపార్టీ భరించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications