కిరణ్ రెడ్డితో చిరంజీవి ఢీ: బిసి కార్డు

ఇదిలావుంటే, రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండడం న్యాయమని, తెలంగాణకు చెందిన దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందున, కోస్తాంధ్రకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కాలని, ఆ పదవి తనకు ఇవ్వాలని బొత్స వాదిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం మంత్రిత్వ శాఖ దక్కితే కిరణ్ కుమార్ రెడ్డిని దీటుగా ఎదుర్కోవచ్చునని బొత్స భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, తాము రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన బిసిలను కాంగ్రెసుకు మద్దతుగా కూడగట్టగలమని చిరంజీవి, బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానానికి చెబుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు అధికారంలోకి రావాలంటే బిసిల మద్దతు కీలకమని, తెలంగాణకు చెందిన బిసీలు కూడా కోస్తాంధ్ర కాపులతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఓ కాపు వర్గానికి చెందిన నాయకుడు పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు పార్టీపై, ప్రభుత్వంపై కాపుల ఆధిపత్యం వస్తే మాత్రమే అది సాధ్యమవుతుందని వివరించినట్లు సమాచారం.
రెడ్లు జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంట నడుస్తున్నారని, కోస్తాలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న కమ్మ సామాజికి వర్గాన్ని ఎదుర్కోవడానికి, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడానికి కాపు నాయకత్వమే మంత్రమని చెబుతున్నారు. చిరంజీవి, బొత్స సత్యనారాయణలకు పార్టీపై, ప్రభుత్వంపై పట్టు వస్తే ఆ పని సులభమవుతుందనే వాదన వినిపిస్తోంది. చిరంజీవి, బొత్స సత్యనారాయణ ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications