జగన్ కేసు: సివిసి వెబ్ సైట్లో ఐఏఎస్‌లు!

సివిసి తన వెబ్‌సైట్‌లో ఇలా పేర్కొనడం చాలా తీవ్రమైన అంశం కావడంతో ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర సంచలనం, చర్చకు దారితీసింది. జగన్ అక్రమాస్తుల కేసులో బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, వెంకట రామిరెడ్డి, మన్మోహన్ సింగ్, శామ్యూల్‌లపై సిబిఐ కేసుల వివరాలను సివిసి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఓబుళాపురం గనులకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై అభియోగాలు వచ్చినప్పుడు ఆమె ప్రాసిక్యూషన్‌కు సిబిఐకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆమెను విచారించి అరెస్ట్ చేశారు.
అలాగే జగన్ అక్రమాస్తుల కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురిపై విచారణకు అనుమతి ఇవ్వాలని సిబిఐ ప్రభుత్వాన్ని ఏడాది కిందటే కోరింది. ఏ అధికారినైనా విచారించేందుకు చవోవఐ అనుమతి కోరితే ప్రభుత్వం మూడు నెలల్లో స్పందించాలి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గరిష్ఠంగా నాలుగు నెలల్లో స్పష్టత ఇవ్వాలి. అయితే, ఈ ఐదుగురి కేసులలో నెలల తరబడి నాన్చుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చడం లేదంటూ సిబిఐ కేంద్ర విజిలెన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.
బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యంలను ఒక కేసులో, బిపిఆచార్య, వెంకట రామిరెడ్డి, మన్మోహన్ సింగ్, శామ్యూల్‌ల పేర్లను మరొక కేసులో ప్రస్తావించింది. వాస్తవానికి, ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం లేదంటూ సిబిఐ వినతిని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయినా, సివిసి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన పేరునూ జాబితాలో చూపించింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications