కొండా సురేఖ: న ఘర్ కా న ఘాట్ కా?

నవభారత్ యువభేరీ సభకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఆె బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగింది. కానీ, అది జరగలేదు. కొండా సురేఖ తిరిగి సొంత గూటికి చేరుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఆమె తీవ్ర ప్రయత్నాలు చేశారని అంటున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కలిసేందుకు కూడా ఆమె తీవ్రంగానే ప్రయత్నాలు సాగించినట్లు చెబుతున్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై, అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్యపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యల కారణంగా తమ పార్టీలోకి తిరిగి సురేఖను తీసుకోవడానికి కాంగ్రెసు నాయకులు సుముఖంగా లేరని అంటున్నారు. సురేఖ వ్యాఖ్యలు ఎప్పుడైనా ఎవరిపై చేసిన అవి ములుకుల్లా గుచ్చుకుంటాయి. అవి మానడం అంత సులభం కూడా కాదు.
ఇకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన విజయరామారావు, చంద్రశేఖర్ వంటి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెసు నాయకత్వం కొండా సురేఖ దంపతులకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. అంటే, కొండా సురేఖపై ఎంతగా కాంగ్రెసు నాయకత్వం నొచ్చుకుందో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications