సాక్షికి 'రియల్' వాటా: పాండేతో ధోనీ లింక్స్

పాండేతో ధోనీ సంబంధాలు రితీ స్పోర్ట్స్ సంస్థను మంచి విస్తరించాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. అందుకు సంబంధించిన పత్రాలను కూడా తాము సంపాదించామని తెలిపింది. పాండే, రితీ స్పోర్ట్స్ మాత్రమే భాగస్వాములుగా ఇతర కొన్ని సంస్థల్లో ధోనీకి, ఆయన కుటుంబానికి వాటాలున్నాయని ఆ పత్రిక రాసింది.
టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, సురేష్ రైనా, ప్రజ్ఞాన్ ఓజాలను మేనేజ్ చేస్తున్న రితీ స్పోర్ట్స్ సంస్థతో సంబంధాల కారణంగా ధోనీ పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. రితీ స్పోర్ట్స్ బోర్డు రితీ ఎంఎస్‌డి అలమోడ్ ప్రైవేట్ లిమిటెండ్‌ను స్థాపిస్తూ నిరుడు మార్చి 22వ తేదీన తీర్మానం చేసిందని, ఇందులో ధోనీకి 6,400, సాక్షికి 100 వాటాలున్నాయని ఆ పత్రిక రాసింది. మరో 3 వేల వాటాలు పాండేకు, 550 వాటాలు రితీ స్పోర్ట్స్‌కు ఉన్నాయని ఆ పత్రిక రాసింది. ధోనీ, ఆయన భార్య సాక్షి కలిసి 65 శాతం వాటాను కలిగి ఉన్నట్లు ఆ పత్రిక రాసింది.
ఆ కంపెనీ డైరెక్టర్లుగా సాక్షి, ప్రతిమా తివారీ (పాండే సోదరి), సుభావతి పాండే (పాండే తల్లి) వ్యవహరిస్తున్నట్లు ఆ పత్రిక రాసింది. పాండే తల్లి రితీ స్పోర్ట్స్‌లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సంస్థకు చెందిన ఇతర వివరాలను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా సవివరంగా రాసింది.
ఇదిలావుంటే, కొన్నికంపెనీలతో కలిసి ధోనీ భార్య సాక్షి జాయింట్ వెంచర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాక్షి వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ తెలియజేస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలిలో సాక్షి ధోనీకి 25 శాతం వాటా ఉంది.
ధోనీ ముద్దు పేరును వాడుతూ సంస్థకు ఆమ్రపాలి మహి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. అమ్రపాలికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ సంస్థ హోమ్ పేజీలో ధోనీ ప్రముఖంగా కనిపిస్తాడు.












Click it and Unblock the Notifications