ఎన్టీఆర్: బాలయ్య వ్యూహం మిస్‌ఫైర్? (ఫొటోలు)

హైదరాబాద్: హీరో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, నందమూరి హీరో బాలకృష్ణ వ్యూహం బెడిసికొట్టిందనే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితమైన వర్గాల నుంచే ఆ మాట వినిపిస్తోంది. పార్టీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న స్థితిలో అందరినీ కలుపుకుని పోవాల్సి ఉంటుందని, ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పట్ల బాలకృష్ణ వ్యవహరించిన తీరు సరిగా లేదని అంటున్నారు.

అత్యంత మొండిగా వ్యవహరించే ఎన్టీ రామారావు కూడా 1989లో ఓడిపోయిన తర్వాత తనకు దూరమైన వారిని తిరిగి దగ్గరకు చేర్చుకున్నారని, అటువంటిది రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడానికి అందరినీ కలుపుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌కు దూరంగా ఉండాలని బాలకృష్ణ పార్టీ నాయకులను ఆదేశించడమే అసలుకు ఎసరు పెట్టిందని అంటున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పక్కా నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. బాలయ్య ఆదేశాలతో తెలుగుదేశం పార్టీలో తనకు స్థానం లేదని ఎన్టీఆర్ గుర్తించారని అంటున్నారు. దాంతో తన సత్తా చాటడానికి అందుబాటులో ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు.

నిజానికి, మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నించారని, అయితే చంద్రబాబు గానీ బాలకృష్ణ గానీ ఆయనను చేరదీయడానికి సుముఖంగా లేరని అంటున్నారు. అయితే, ఆయనను అలా వదిలేయకుండా విజయవాడ పర్యటన సందర్భంగా బాలయ్య పార్టీ నాయకులకు ఇచ్చిన ఆదేశాలు జూనియర్ ఎన్టీఆర్‌ను రెచ్చగొట్టాయని కూడా అంటున్నారు. దాంతో పార్టీలో ముసలం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 జూ. ఎన్టీఆర్: బాలయ్య వ్యూహం మిస్‌ఫైర్? (ఫొటోలు)

ఎన్టీఆర్ కుమారుడే కాకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వియ్యంకుడు కూడా అయిన హీరో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పట్ల అనుసరించిన వ్యూహం బెడిసికొట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిని కాదని బాలయ్య పార్టీలో సొంత నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలులో పెట్టే దిశగా సాగుతున్నారని అంటున్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు.

 జూ. ఎన్టీఆర్: బాలయ్య వ్యూహం మిస్‌ఫైర్? (ఫొటోలు)

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఎన్టీ రామారావు మాట మాత్రమే చెల్లుబాటు అయ్యేది. ఎన్టీఆర్ అంత కటువుగానూ, నిక్కచ్చిగానూ వ్యవహరించేవారు. ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిలో ఆ నిక్కచ్చితనం, ధైర్యం లోపించిందనే మాట వినిపిస్తోంది. దానివల్లనే బాలయ్య మరోవైపు సొంత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇస్తున్నారని అంటున్నారు.

 జూ. ఎన్టీఆర్: బాలయ్య వ్యూహం మిస్‌ఫైర్? (ఫొటోలు)

తన విజయవాడ పర్యటన సందర్భంగా ఎవరూ హాజరు కావద్దని బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చిన ఆదేశాలు జూనియర్ ఎన్టీఆర్‌ను రెచ్చగొట్టాయని అంటున్నారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి పూర్తిగా దూరం కావడమే కాకుండా నష్టం చేసే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా దూరం చేసుకోవడం సరి కాదనే మాట చంద్రబాబు సన్నిహిత వర్గాల నుంచే వినిపిస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+